Unmukt Chand : టీమిండియా క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. 2012 టీమిండియా అండర్ 19 జట్టుకి స్టార్ క్రికెటర్. అయితే ఐపీఎల్ లో రాణించాడు. కానీ టీమిండియా జట్టులో చోటు దక్కక అమెరికా జట్టు తరుపున ఆడుతున్నాడు. అయితే ఇప్పుడు ఇతను తండ్రి కాబోతున్నాడు. సోషల్ మీడియాలో రొమాంటిక్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తన భార్య పుట్టిన రోజు సందర్భంగా ఓ పార్కుకి వెళ్లి.. భార్యకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.” మీరు నాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన బహుమతి, మిమ్మల్ని నా ప్రపంచంలోకి తీసుకొచ్చినందుకు నేను దేవునికి తగినంతగా కృతజ్ఞతలు చెప్పలేను. వాస్తవానికి సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ల్లో నా భావాల గురించి ఎక్కువగా మాట్లాడలేను. కానీ ఈరోజు నేను వెనక్కి తగ్గలేను. నా చిరునవ్వుకి, నా బలానికి కారణం నువ్వే. నేను USAలో పునఃప్రారంభించేటప్పుడు నాకు మద్దతునిస్తూ మీరు నా కెరీర్‌ను మీ కంటే ముందుంచారు” అంటూ పోస్ట్ చేశారు.
Also Read : IND Vs PAK : UAE కు చుక్కలు చూపించిన టీమిండియా…ప్యాంట్ లోనే పోసుకుంటున్న పాకిస్తాన్
“మా తల్లిదండ్రులు, మీతో ప్రయాణం అనుభవించడం చాలా సంతోషం. మీరు ఇప్పుడు తల్లికాబోతున్నారు. మీకు మరింత శక్తి,, నా ప్రేమ, మీరు మంచి తల్లిగా ఉంటారని నాకు తెలుసు. అన్నికంటే మించి సంతోషంగా, సంతృప్తిగా, నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇండియా లో ఉన్ముక్త్ చంద్ క్రికెట్ కెరీర్ ని పరిశీలించినట్టయితే.. ఢిల్లీ అండర్ 19 జట్టుతో తన తొలి ఆటలోనే ఉన్ముక్త్ చంద్ 499 పరుగులు చేసి ఔరా అనిపించాడు. 499 పరుగుల్లో 2 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ ఉన్నాయి. అండర్ 19 లలో అద్భుతమైన ప్రదర్శన అతనికి ఢిల్లీ సీనియర్ జట్టులో చోటు కల్పించింది. 2010-11 రంజీ ట్రోఫీలో అనుభవజ్ఞుడైన రైల్వేస్ దాడికి వ్యతిరేకంగా సీమింగ్ ట్రాక్ పై 151 పరుగులు చేశాడు. ఆ ఏడాది తను ముంబై, సౌరాష్ట్ర పై రెండు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. 5 మ్యాచ్ ల్లో 400 పరుగులు చేశాడు. దీంతో జూనియర్ స్థాయిలో వినూ మన్కడ్, కూచ్ బెహర్ ట్రోఫీలో ఆడాడు. మరోవైపు 2021 మైనర్ క్రికెట్ లీగ్ యూఎస్ ఏ విజేత కెప్టెన్ తో పాటు అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ కూడా కావడం విశేషం.
అలాగే ఢిల్లీ అండర్ 19 జట్టు, నార్త్ జోన్ అండర్ 19 జట్టుకి కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఆ తరువాత భారత అండర్ 19 జట్టుకు కెప్టెన్ అవ్వడమే కాకుండా కీలక ఆటగాడిగా పేర్గాంచాడు. దీంతో 2011 ఐపీఎల్ లో ఢిల్లీ డేవిల్స్ తరపున ఎంట్రీ ఇచ్చాడు. 2013లో కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆడాడు. ఇక ఆ తరువాత రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడాడు. 2015లో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. అయితే అతను ఎక్కువ మ్యాచ్ ల్లో ఆడకపోయినా ఆ ఏడాది ముంబై ఇండియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఇక మధ్యలో సరిగ్గా ఫామ్ కనబరచకపోవడంతో టీమిండియాకి సెలెక్ట్ కాలేదు. ప్రస్తుతం అమెరిక్ తరపున ఆడుతున్నాడు ఉన్ముక్త్ చంద్. అమెరికన్ క్రికెట్ లో కీలక ఆటగాడు వెలుగొందుతున్నాడు. ఇలా సొంత దేశంలో అవకాశాలు రాకుంటే.. ఇతర దేశాల తరపున ఆడేవారు చాలా మంది ఉన్నారు. వారిలో ఉన్ముక్త్ చంద్ ఒకరు. అయితే ఉన్ముక్త్ చంద్ భార్య ప్రస్తుతం ప్రెగ్నెన్సీ. అయితే తన భార్యతో కలిసి ఉన్నటువంటి ఫొటోలు, బేబీ బంప్స్ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అవి తెగ వైరల్ అవుతున్నాయి. బిగ్ బాష్ లీగ్ లో ఆడి తొలి భారతీయ పురుషుడిగా నిలిచాడు ఉన్ముక్త్ చంద్.
https://www.facebook.com/share/167nGtsorg/