Rishabh Pant: 2022 డిసెంబర్ నెలలో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ కి ఉత్తరాఖండ్ లోని రూర్కి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. ఈ రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. కారు రెయిలింగ్ ని ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలో నుండి బయటకు దూకేసిన పంత్ ని.. అటువైపుగా వెళుతున్న ఉత్తరప్రదేశ్ కి చెందిన రజత్ కుమార్ {25}, అతడి స్నేహితుడు నిషు కుమార్ ప్రమాదం నుంచి రక్షించారు.
Also Read: Natasha Pandya – Hardik Pandya: సిక్సులతో పాండ్యా ఉగ్రరూపం… నటాషా రియాక్షన్ అదుర్స్ !
పంత్ పై ఓ దుప్పటి కప్పి కారు నుండి దూరంగా తీసుకువెళ్లారు. ఆ తరువాత అంబులెన్స్ కి ఫోన్ చేసి గోల్డెన్ అవర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో పంత్ ని రక్షించిన ఈ ఇద్దరినీ హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు సత్కరించాయి. వీరికి ఐదు వేల రూపాయలను బహుమతిగా అందించారు. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ కుడి మోకాలికి గాయంతో పాటు ఇతర గాయాలు తగిలాయి. ఈ పరిస్థితి కారణంగా అతడు సంవత్సర కాలం పాటు క్రికెట్ కి దూరమయ్యాడు.
ఇక పంత్ కోలుకున్న అనంతరం ఈ ఇద్దరి ధైర్య సాహసాలను గుర్తించి.. వారికి కృతజ్ఞతగా స్కూటర్లను బహుమతిగా అందించాడు. అయితే రోడ్డు ప్రమాదం నుండి పంత్ ని కాపాడిన ఉత్తరప్రదేశ్ యువకుడు రజత్ కుమార్ ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. తన ప్రియురాలు మన్నూ కష్యపతో కలిసి విషం తాగి ఆత్మ*** త్య యత్నానికి పాల్పడ్డాడు.
వీరి పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదన్న బాధతో ఈ నెల 9న తన ప్రియురాలితో కలిసి విషం తాగి ఆత్మ*** త్య యత్నానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ఈ ఘటన జరిగింది. తీవ్ర అస్వస్థతకు గురైన వీరిద్దరిని ఉత్తరాఖండ్ రూర్కి ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ అతడి ప్రియురాలు కష్యప మృతి చెందగా.. ప్రస్తుతం రజత్ కుమార్ పరిస్థితి విషమంగా ఉంది.
వీరిద్దరి కులాలు వేరు కావడం వల్ల ఇరుకు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి ఒప్పుకోలేదని.. ఈ క్రమంలో మనస్థాపానికి గురైన ఈ ఇద్దరూ ఆత్మ*** త్య యత్నం చేసినట్లు సమాచారం. అయితే రజత్ కుమార్ తమ కుమార్తెను కిడ్నాప్ చేసి విషం ఇచ్చాడని, ఆమె మృతికి రజత్ కారణమని మృతురాలి తల్లి ఆరోపిస్తోంది.
Also Read: Virat Kohli – Rajat Patidar: రజత్ కెప్టెన్సీ..కోహ్లీకి ఇష్టం లేదా.. ఇదిగో వీడియో ?
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక రిషబ్ పంత్ ప్రస్తుతం పూర్తిగా కోలుకొని క్రికెటర్ గా కొనసాగుతున్నాడు. ఒక్క సంవత్సరంలోనే రికవరీ అయిపోయి తిరిగి క్రికెట్ లో రాణిస్తున్నాడు. అయితే అతడి ప్రాణాలు కాపాడిన వ్యక్తి పరిస్థితి ఇప్పుడు సీరియస్ గా ఉండడంతో.. అతడిని ఆదుకోవాలని కోరుతున్నారు నెటిజెన్లు.