Natasha Pandya – Hardik Pandya: భారత్ – ఇంగ్లాండ్ మధ్య జరిగిన 3 వన్డేల సిరీస్ ని భారత జట్టు 3 – 0 తో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. మొదటి రెండు వన్డేలలో భారత్ 249, 305 పరుగుల లక్ష్యాలను ఛేదించింది. ఇక ఫిబ్రవరి 12న అహ్మదాబాద్ లో జరిగిన చివరి వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో భారత జట్టు 356 పరుగుల భారీ స్కోరుని చేసింది.
Also Read: Virat Kohli – Rajat Patidar: రజత్ కెప్టెన్సీ..కోహ్లీకి ఇష్టం లేదా.. ఇదిగో వీడియో ?
మొదటి వన్డేలో పెద్దగా రాణించలేకపోయిన రోహిత్ శర్మ.. రెండవ వన్డేలో సెంచరీతో భారత జట్టును గెలిపించాడు. కానీ మళ్ళీ మూడవ వన్డేలో ఒక్క పరుగు మాత్రమే చేసి పెవీలియన్ చేరాడు. ఈ మ్యాచ్ లో గిల్ చెలరేగి ఆడి 102 బంతులలో 112 పరుగులు చేసి భారత స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి తోడు విరాట్ కోహ్లీ కూడా హాఫ్ సెంచరీ, శ్రేయస్ అయ్యర్ 78 పరుగులతో రాణించారు. ఇక ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా ఆడింది తక్కువే అయినా.. రెండు భారీ సిక్సర్లు బాదాడు.
బ్యాటింగ్ కి దిగిన మొదటి నుండే హిట్టింగ్ ప్రారంభించి.. 9 బంతులలో 17 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో అందరికంటే హార్దిక్ పాండ్యా స్ట్రైక్ రేట్ {188.89} ఎక్కువ. అయితే ఈ మూడవ వన్డే చూసేందుకు హార్థిక్ పాండ్యా భార్య నటాషా స్టాంకోవిచ్ వచ్చిందని, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆమె ఎంతగానో ఎంజాయ్ చేసిందంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇంగ్లాండ్ బౌలర్ ఆదిల్ రషీద్ బౌలింగ్ లో హార్దిక్ పాండ్యా స్టెపౌట్ అయ్యి సిక్స్ కొట్టిన సందర్భంలో ఆమె అమేజింగ్ రియాక్షన్ ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కానీ ఈ ఫోటోలు ఫేక్ అని తేలిపోయింది. హార్దిక్ పాండ్యా సిక్స్ కొట్టిన ఫోటోలు ఇంగ్లాండ్ తో జరిగిన మూడవ వన్డే కి సంబంధించినవే కానీ.. నటాషాకి సంబంధించిన ఫోటోలు ఈ జంట విడాకులు తీసుకోకముందువని సమాచారం.
అయితే ఈ ఫోటోలు ఫేక్ అని తెలిసిన నెటిజెన్లు.. ఒకవేళ ఆమె స్టేడియానికి వచ్చి ఉంటే హార్దిక్ ఇలా ఆడేవాడు కాదని కామెంట్స్ చేస్తున్నారు. ఇక హార్దిక్ – నటాషా జంట 2024 జూలై నెలలో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ జంట కి 2020 మే నెలలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది.
Also Read: Indian Cricketers: టీమిండియా ప్లేయర్లకు సెలవులు.. ఇంటికి పయనం… వీడియో వైరల్ !
ఆ తరువాత 2023 ఫిబ్రవరిలో క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. 2020 లోనే వీరికి ఓ కుమారుడు జన్మించాడు. అయితే మీరు విడాకులు తీసుకున్న విషయాన్ని ఇద్దరూ సోషల్ మీడియాలో వేరువేరుగా ప్రకటించారు. ఇది చాలా కఠిన నిర్ణయం అయినప్పటికీ తప్పడం లేదని, కుమారుడు అగస్త్య కు ఇద్దరం కో పేరెంట్స్ గా కొనసాగుతామని స్పష్టం చేశారు.