BigTV English

Hindupur Assembly Constituency : బాలకృష్ణ మరోసారి తొడ కొడతారా..? హిందూపూర్‌లో గెలుపెవరిది..?

Hindupur Assembly Constituency : బాలకృష్ణ మరోసారి తొడ కొడతారా..? హిందూపూర్‌లో గెలుపెవరిది..?
ap politics

Hindupur Assembly Constituency(AP politics):

హిందూపురం నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న ఈ సెగ్మెంట్ పై ఇప్పుడు అందరి ఫోకస్ పడింది. వరుసగా రెండుసార్లు గెలుస్తూ వస్తున్న బాలకృష్ణ ఇప్పుడు కూడా హ్యాట్రిక్ కొట్టబోతున్నారా…? వైసీపీ అభ్యర్థికి జనం ఎంత వరకు సపోర్ట్ ఇస్తారన్నది బిగ్ టీవీ సర్వేలో క్లారిటీ వచ్చింది. 1983 నుంచి హిందూపురం టీడీపీకే జై కొడుతోంది. ఈ అసెంబ్లీకి మొదటగా ఎన్టీ రామారావు ప్రాతినిథ్యం వహించారు. ఆ తర్వాత నందమూరి హరికృష్ణ బై ఎలక్షన్ లో గెలిచారు. ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన బాలకృష్ణ ఎమ్మెల్యేగా వరుసగా రెండుసార్లు గెలిచారు. గత ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కనిపించింది. మరి ఇప్పుడు హిందూపురం జనం మూడ్ ఎలా ఉందో చూసే ముందు 2019 ఎన్నికల ఫలితాలను విశ్లేషిద్దాం.


2019 RESULTS : నందమూరి బాలకృష్ణ (గెలుపు) VS షేక్ మహ్మద్ ఇక్బాల్
2019 అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం సెగ్మెంట్ లో టీడీపీ సత్తా చాటింది. సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఇక్కడి నుంచి బరిలో దిగి 51 శాతం ఓట్ షేర్ సాధించారు. అదే సమయంలో వైసీపీ నుంచి చివరి నిమిషంలో టిక్కెట్ దక్కించుకుని పోటీ చేసిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ షేక్ మహ్మద్ ఇక్బాల్ 42 శాతం ఓట్లు రాబట్టారు. జనసేన 2 శాతం మాత్రమే ఓట్లు రాబట్టింది. మరి వచ్చే ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థుల ప్రభావం హిందూపురం సెగ్మెంట్ లో ఎలా ఉంది? ప్రజల స్పందనేంటి? బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

నందమూరి బాలకృష్ణ (TDP)


బాలకృష్ణ ప్లస్ పాయింట్స్

  • జగన్ వేవ్ ఉన్నా సొంత ఇమేజ్ తో గెలుపు
  • ప్రజల్లో బాలకృష్ణకు మంచి పేరు
  • సొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు
  • ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం

బాలకృష్ణ మైనస్ పాయింట్స్

  • సినిమా షూటింగ్ లతో నియోజకవర్గానికి దూరం
  • హార్ష్ కమ్యూనికేషన్ తో క్యాడర్ కు ఇబ్బంది

కోడూరు దీపిక (YCP)

కోడూరు దీపిక ప్లస్ పాయింట్స్

  • కురుబ, రెడ్డి సామాజికవర్గాల మద్దతు
  • వైసీపీలో యాక్టివ్ రోల్
  • పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సపోర్ట్

కోడూరు దీపిక మైనస్ పాయింట్స్

  • కొత్తగా నియోజకవర్గ ఇంఛార్జ్ గా బాధ్యతలు
  • క్యాడర్ అంతా కలిసి వస్తారా అన్న డౌట్లు

కులాల వారీగా
వాల్మీకి బోయ 20%
ముస్లిం 18%
ఎస్సీ 14%
కురుబ 13%
రెడ్డి 10%
షెట్టి బలిజ 6%

హిందూపురంలో బోయ వాల్మీకీ కమ్యూనిటీ బలంగా ఉంది. ఇందులో వైసీపీకి 40 శాతం మంది, టీడీపీకి 55 శాతం, జనసేనకు 5 శాతం మద్దతు ఇస్తామని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో తమ అభిప్రాయం చెప్పారు. ఇక ముస్లింలలో జగన్ పార్టీకి 50 శాతం, టీడీపీకి 40 శాతం, జనసేనకు 10 శాతం మద్దతు పలుకుతామంటున్నారు. ఇక ఎస్సీల్లో వైసీపీకి 45 శాతం, టీడీపీకి 50 శాతం, జనసేనకు 5 శాతం సపోర్ట్ ఇస్తామంటున్నారు. అటు కీలకమైన కురుబ సామాజికవర్గంలో 55 శాతం మంది వైసీపీకి, 40 శాతం టీడీపీకి, 5 శాతం జనసేనకు మద్దతు పలుకుతున్నారు. రెడ్డి కమ్యూనిటీలో వైసీపీకి 55 శాతం, టీడీపీకి 40 శాతం, జనసేనకు 5 శాతం సపోర్ట్ ఇస్తామంటున్నారు. షెట్టిబలిజ వర్గంలో వైసీపీకి 45 శాతం, టీడీపీకి 50 శాతం, జనసేనకు 5 శాతం మద్దతు ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో జనం తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ఇక వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..
నందమూరి బాలకృష్ణ vs కోడూరు దీపిక

TDP 56%
YCP 38%
OTHERS 6%

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే… హిందూపురంలో మరోసారి బాలకృష్ణదే పైచేయిగా కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో తేలింది. టీడీపీకి మొత్తం 56 శాతం ఓట్ షేర్ వస్తుందని సర్వేలో తేలింది. అదే సమయంలో వైసీపీ అభ్యర్థి 38 శాతం ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతరులు 6 శాతం ఓట్లు సాధించే ఛాన్సెస్ ఉన్నాయి.

.

.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×