Pakistan PM-ICC: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India vs Pakistan) మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఐసీసీ ఫిక్స్ చేసిన షెడ్యూల్ ప్రకారం ఇండియాతో అసలు మ్యాచ్ ఆడబోమంటూ మొండిపట్టు పట్టింది పాకిస్తాన్. ఐసీసీ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, అసలు పట్టించుకోవడమే లేదు. తాజాగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ( Shehbaz Sharif ) మరో సంచలన ప్రకటన చేశారు. మీరు ఎన్ని ఎత్తులు వేసినా, టీమిండియా తో మ్యాచ్ ఆడేది లేదు అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రకటించేశారు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్. అయితే ఈ ప్రకటన నేపథ్యంలో ఐసీసీ చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ వల్ల నష్టాన్ని మొత్తం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో కక్కించేందుకు సిద్ధమైందట. ఈ మేరకు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది ఐసీసీ.
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఈ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ ఫిక్స్ అయింది. అయితే, షెడ్యూల్ ఫిక్స్ అయిన తర్వాత పాకిస్తాన్ మాట మార్చింది. కుక్క తోక ఎప్పుడూ వంకర అన్న చందంగా పాకిస్తాన్ వ్యవహారం మారింది. ఈ నేపథ్యంలో ఐసీసీ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమైందట. ఐసీసీ యాక్షన్ తీసుకుంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రోడ్డున పడే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు. ఇప్పటికైనా ఇండియాతో మ్యాచ్ ఆడండి.. లేదా 35 మిలియన్ డాలర్స్ ఐసీసీకి కట్టాల్సిందేనని వార్నింగ్ ఇచ్చిందట. అంటే దాదాపు 300 కోట్ల వరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన జేబు నుంచి డబ్బులు కట్టాల్సి ఉంటుంది.
ఒకవేళ కట్టబోమంటూ డ్రామాలు చేస్తే, కోర్టు మెట్లు ఎక్కనుందట ఐసీసీ. ఐసీసీ రూల్స్ ప్రకారం ఎలాంటి కారణం చూపకుండా మ్యాచ్ బహిష్కరిస్తే, సదరు క్రికెట్ బోర్డు మాత్రమే ఆ నష్టపరిహారాన్ని చెల్లించాల్సిందేనట. అందుకే బ్రాడ్ కాస్టర్లతో పాటు ఐసీసీకి డబ్బులు సిద్ధం చేసుకోవాలట పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అలాగే భవిష్యత్తులో విదేశీ క్రికెటర్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటులో పాల్గొనకుండా ఆదేశాలు ఇవ్వనుందట ఐసీసీ (ICC). ఇక ఇండియా మ్యాచ్ స్కిప్ చేస్తే… టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ ను తొలగించే ప్రమాదం కూడా ఉందట. అంటే ఇండియాతో మ్యాచ్ ఆడకుంటే, పాకిస్తాన్ కే అన్ని విధాల నష్టాలు జరిగే ప్రమాదం ఉంది అన్న మాట.
HUGE TROUBLE for PAKISTAN!
Broadcasters set to SUE PCB over boycott of IND vs PAK clash on Feb 15 in Colombo.ICC warns: Play or lose ENTIRE ~$35M annual revenue share! as Pak PM Shehbaz Sharif showers solidarity to kanglus.#ICCT20WORLDCUP pic.twitter.com/HCmNnYzK9G
— Megh Updates 🚨™ (@MeghUpdates) February 5, 2026