E-Paper
Advertisement

Shahid Afridi: టీమిండియాకు ఆ మ‌గ‌తనం లేదు…వెస్టిండీస్ లాంటి పోటుగాళ్లే సెమీస్ కు వెళ్లాలి

Shahid Afridi: టీమిండియాకు ఆ మ‌గ‌తనం లేదు…వెస్టిండీస్ లాంటి పోటుగాళ్లే సెమీస్ కు వెళ్లాలి

Shahid Afridi:  టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ ( India vs West Indies) జట్ల మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ ( Eden Gardens, Kolkata) వేదికగా బిగ్ ఫైట్ ఉంటుంది. ఇవాళ రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందులో గెలిచిన జట్టు సెమీ ఫైనల్ రేసులో ఉంటుంది. ఓడిపోయిన జట్టు ఇంటి దారి పట్టాల్సిందే. అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియా కంటే వెస్టిండీస్ సెమీ ఫైనల్ కు వెళ్తేనే మంచిదని వ్యాఖ్యానించారు. టీమిండియాకు సెమీఫైనల్ వెళ్లే అర్హత లేదని బాంబు పేల్చారు. టీమిండియాకు టైటిల్ గెలిచే మ‌గ‌తనం లేదు…వెస్టిండీస్ లాంటి పోటుగాళ్లే సెమీస్ కు వెళ్లాలని కోరారు. వెస్టిండీస్ సెమీస్ కు వెళితే, క‌చ్చితంగా టైటిల్ గెలుస్తుంద‌న్నారు. కానీ ఇండియాకు ఆ ద‌మ్ము లేద‌ని ప‌రువు తీశాడు. ప‌సికూన‌ల‌పైనే ఇండియా విజ‌యం సాధిస్తుంద‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi).

Also Read: Fakhar Zaman : పాకిస్తాన్ తో శ్రీలంక మ్యాచ్ ఫిక్సింగ్‌..లైవ్ మ్యాచ్ లోనే అండంగా దొరికిపోయారు, ఇదిగో వీడియో

టీమిండియాకు ఆడే మ‌గ‌తనం లేదు…వెస్టిండీస్ లాంటి పోటుగాళ్లే సెమీస్ కు వెళ్లాలి

టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్ ఇవాళ సాయంత్రం జరగనున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియాకు బలమైన జట్లపైన ఆడే మగతనం లేదని.. వెస్టిండీస్ లాంటి పోటుగాళ్లు మాత్రమే సెమీ ఫైనల్ లోకి అడుగు పెట్టాలని కోరారు. ఇవాల్టి మ్యాచ్ లో వెస్టిండీస్ విజయం సాధిస్తే సంతోషమన్నారు. దీంతో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే అతను చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. మీ పాకిస్తాన్ కు ఆ మగతనం లేకపోవడంతోనే ఇంటిదారి పట్టిందని కౌంటర్లు పేల్చుతున్నారు. అందుకే సూప‌ర్ 8 నుంచి ఇంటికి వెళ్లింద‌ని ఎద్దేవా చేస్తున్నారు. ఇవాళ వెస్టిండీస్ పై విజయం సాధించి టీం ఇండియా సెమీ ఫైనల్ కు చేరుకుంటుందని మరి కొంతమంది చురకలు అంటిస్తున్నారు. సెమీ ఫైనల్ వెళ్లడమే కాదు టైటిల్ కూడా గెలుచుకుంటుందని టీమిండియా ఫ్యాన్స్ సవాల్ విసిరుతున్నారు.

వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్ కు వర్షం అద్దంకి

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగబోయే వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్ కు ముందు ఊహించని పరిణామం ఎదురయింది. ఈ మ్యాచ్ ప్రారంభం అయ్యే ముందు వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ వర్షం భారీగా పడి మ్యాచ్ రద్దు అయితే మాత్రం ఇండియా ప్రమాదంలో పడుతుంది. నెట్ రన్ రేట్ ప్రకారం ఇండియా ఇంటి దారి పడుతుంది. అదే సమయంలో వెస్టిండీస్ సెమీఫైనల్ లో అడుగుపెడుతుంది.

Also Read: US Israel Iran War: టీ20 వ‌రల్డ్ క‌ప్ పై వార్ ఎఫెక్ట్..గ‌జ గ‌జ వ‌ణికిపోతోన్న ప్లేయ‌ర్లు..రంగంలోకి ఐసీసీ

?utm_source=ig_web_copy_link

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×