Big Stories

Pakistan Team: ఉప్పల్ స్టేడియం స్టాఫ్ పై తమ ప్రేమాభిమానాలు చాటుకున్న పాక్ ఆటగాళ్లు..

Pakistan Team: నిన్న ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ క్రికెట్ టీం శ్రీలంకపై చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచకప్ వార్మ్ అప్ మ్యాచెస్, రెగ్యులర్ మ్యాచెస్ కోసం గత రెండు వారాలుగా హైదరాబాద్ నగరంలో బస చేస్తున్న పాక్ టీమ్,ఈ మ్యాచ్ తర్వాత నగరానికి వీడ్కోలు పలికింది. ఇక్కడ ప్రజల అభిమానానికి ,ఆతిథ్యానికి పాక్ ఆటగాళ్లు పొంగిపోయారు. మరీ ముఖ్యంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం, అదే మన ఉప్పల్ స్టేడియం సిబ్బంది సేవలకు పాక్ టీం ఫిదా అయ్యింది.

- Advertisement -

 ఐసీసీ వరల్డ్ కప్ 2023 లో భాగంగా ఇప్పటివరకు పాక్ ఆడిన రెండు మ్యాచులు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో జరిగాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి వాతావరణంతో పాటు ప్రజలతో కూడా పాక్ ఆటగాళ్లు బాగా మమేకమైపోయారు. ఒకరకంగా హైదరాబాద్ నగరంలో ఉండడం వారికి స్వదేశానుభూతిని కలిగించిందని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా వరకు హైదరాబాదులోని భాష ,ఆచార వ్యవహారాలు, భోజనం వారికి కొత్త ప్రదేశానికి వచ్చిన భావన కలగనివలేదు.

- Advertisement -

మరీ ముఖ్యంగా క్రికెట్ అభిమానుల ఆదరణ కారణంగా పాక్ ఆటగాళ్లు తమ సొంత మనుషుల మధ్య ఉన్నట్టే భావించారు. ఐసీసీ వరల్డ్ కప్ 2023లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లలో ఉప్పల్ స్టేడియంలోనే వార్మప్ మ్యాచ్ లతో కలిపి పాక్ మొత్తం నాలుగు మ్యాచ్ లు ఆడింది. నిన్నటి మ్యాచ్ పూర్తి అయిన తర్వాత పాక్ జట్టు అహ్మదాబాద్ కు వెళ్లడానికి సిద్ధమవుతోంది. అక్టోబర్ 14న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో…యావత్ ప్రపంచంలోని క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న దాయాదుల పోరు కోసం పాక్ అహ్మదాబాద్ చేరుకుంటుంది.

అక్టోబర్ 14న అహ్మదాబాద్ స్టేడియంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం టికెట్స్ తో పాటు స్టేడియం చుట్టుపక్కల హోటల్ కూడా హౌస్ ఫుల్. కాగా నిన్నటి మ్యాచ్ లో లంక పై విజయ ఢంకా ముగించిన పాక్ క్రికెటర్లు మ్యాచ్ అనంతరం ఉప్పల్ స్టేడియంలోని గ్రౌండ్ స్టాఫ్ పై తమకు ఉన్నటువంటి ప్రేమాభిమానాలను చాటుకున్నారు.

గత రెండు వారాలుగా హైదరాబాదులో తమ బసను ఎంతో ఆహ్లాదకరంగా మార్చిన ఉప్పల్ మైదాన సిబ్బందికి వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్టేడియం సిబ్బంది యొక్క నిస్వార్ధమైన సేవలను కొనియాడారు. మ్యాచ్ పూర్తి అయిన తర్వాత వారితో ప్రత్యేకంగా ఫోటోలు దిగడంతో పాటు పాక్ కెప్టెన్ బాబర్ 

ఆజం.. తన జెర్సీని వారికి గిఫ్ట్ గా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో రేపు అక్టోబర్ 14న జరగబోయే మ్యాచ్ గురించి కూడా అక్కడక్కడ ప్రస్తావన వస్తోంది. నిన్న మ్యాచ్ తర్వాత పాక్ ఎంత భీకరమైన ఫామ్ లో ఉందో స్పష్టంగా అర్థం అవుతుంది. టీమిండియాలో కింగ్ కోహ్లీ ఉన్నాడు…రాహుల్ ఉన్నాడు…కానీ ఓపెనర్ల విషయంలో అక్కడక్కడ సందేహాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జరగబోయే మ్యాచ్ పై మిమర్స్ కూడా తమ ప్రతిభకు పని చెబుతున్నారు. ఈరోజు ఇండియా ఆఫ్ఘనిస్తాన్ తో ఢిల్లీలోని అరుణ్ జెట్లీ స్టేడియంలో తలపడనుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News