BigTV English

Pakistan – World Cup: కీలక మ్యాచ్‍కు ముందు పాక్ కు షాక్.. వైరల్ ఫీవర్ కలవరం..!

Pakistan – World Cup: కీలక మ్యాచ్‍కు ముందు పాక్ కు షాక్..  వైరల్ ఫీవర్ కలవరం..!

Pakistan – World Cup: వన్డే వరల్డ్ కప్ 2023 లో ఒకవైపు సంచలనాలు నమోదై వైరల్ అవుతుంటే.. మరోవైపు పాకిస్తాన్ జట్టులో మాత్రం వైరల్ ఫీవర్లు అటాక్ అయ్యాయి. ఒకరి తర్వాత ఒకరు జట్టులో విష జ్వరాల బారిన పడుతున్నారని పాకిస్తాన్ మీడియా మేనేజర్ అషాన్ ఇఫ్తికార్ తెలిపాడు.


అసలేమైంది?

పాకిస్తాన్ జట్టుకి అని నెటిజన్లు ఇంటర్నెట్ అంతా తెగ వెతికేస్తున్నారు. అయితే ఎవరెవరు జ్వరాల బారిన పడ్డారో ఆ వివరాలు మాత్రం చెప్పలేదు. అయితే రెండురోజుల్లో బెంగళూరులో ఆస్ట్రేలియాతో మ్యాచ్ జరగనుంది. జట్టు అంతా చిన్నస్వామి స్టేడియానికి చేరుకుంది.


వైద్యుల పర్యవేక్షణలో ఆటగాళ్లు ఉన్నారని మేనేజర్ తెలిపారు. చివరికి ఎంతమంది ఆడతారు? ఎంతమంది ఉంటారనే సంగతి బెంగళూరు మ్యాచ్ లోనే తేలాలా ఉంది. అంతవరకు వీరు చెప్పరని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లతో ఆడిస్తారా? లేదంటే కొత్త  ఆటగాళ్లను రప్పిస్తారా? అనే సంగతి తెలీదు. ఒకవేళ రప్పించాలంటే వీళ్లు రేస్ లో పరిగిడితేనే ఆ దిశగా ఆలోచిస్తారని మరికొందరు అంటున్నారు.

కొందరు నెటిజన్లు మాత్రం సరదాగా వ్యాఖ్యానించేదేమిటంటే ఇండియాతో మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లకీ జ్వరాలు వచ్చేశాయని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు వరుసగా వరల్డ్ కప్ సెంటిమెంటుని బ్రేక్ చేయకపోవడం కూడా పాకిస్తాన్ టీమ్ నే కాదు,  మేనేజ్ మెంట్ ని కూడా బాధిస్తోంది. ఇంకా ఎన్నాళ్లిలా ప్రపంచకప్ లో ఇండియా చేతిలో చావుదెబ్బలు తినాలని అనుకుంటూ ఉండవచ్చునని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఏదేమైనా దాయాదుల పోరు అంటే అందరిలో ఒత్తిడి ఉంటుంది. యువకులతో నిండిన పాకిస్తాన్ టీమ్ లో అది కొద్దిగా ఎక్కువగా ఉందని చెప్పాలి. ప్రపంచ క్రికెట్ ర్యాంకింగ్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న బాబర్ ఆజామ్ కెప్టెన్ గా ఉండి కూడా ఇండియా మీద తేలిపోతున్నాడని పాకిస్తాన్ మీడియా వాపోతోంది. ప్రస్తుతానికైతే కెప్టెన్ బాబర్ ఆజామ్, స్టార్ పేసర్ షహీన్ షా ఆఫ్రిది ఆరోగ్యంగా ఉన్నారని తెలిసింది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×