BigTV English

ICC Fire on Gurbhaj : రూల్స్ ఉల్లంఘన.. గుర్భాజ్ పై ఐసీసీ ఫైర్..

ICC Fire on Gurbhaj : రూల్స్ ఉల్లంఘన.. గుర్భాజ్ పై ఐసీసీ ఫైర్..

ICC Fire on Gurbhaj : పసికూన ఆఫ్గానిస్తాన్..డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ని ఓడించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అక్కడ జరిగిన ఒక సంఘటన మాత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్ త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ గా వచ్చిన గుర్భాజ్ మాత్రం ముందూ వెనకా చూడకుండా దొరికిన బాల్ ని దొరికినట్టు ఎడాపెడా బాదేశాడు. సరిగ్గా 19వ ఓవర్ లో గుర్భాజ్ రనౌట్ అయ్యాడు. అప్పటికి అతను 57 బంతుల్లో 80 పరుగులు చేసి మంచి ఊపు మీద ఉన్నాడు.


ఎప్పుడైతే రనౌట్ అయ్యాడో అతనిలో అసహనం కట్టలు తెంచుకుంది. సెంచరీ మిస్ అయ్యిందనే బాధ, బాల్ కరెక్ట్ గా బ్యాట్ కి కనెక్ట్ అవుతుందనే టైమ్ లో అనవసరంగా రనౌట్ అయ్యాననే ఆవేదనతో ఫీల్డ్ లోంచి బయటకు వచ్చాడు. అదే టైమ్ లో  బ్యాట్ తో అక్కడ ఉన్న కుర్చీకి కోపంగా ఒక్కటిచ్చాడు. అంతే అది మూడుమొగ్గలేసి ఎక్కడో పడింది. దీనిపై ఐసీసీ సీరియస్ అయ్యింది.

ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని లెవల్ 1 తప్పిదానికి పాల్పడినందుకు ఆఫ్గాన్ ఓపెనర్ గుర్భాజ్ ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మందలించింది. ఐసీసీ రూల్స్ బుక్ ప్రకారం క్రికెట్ పరికరాలు, లేదా మైదానం పరికరాలపై దాడి చేయడం ఆర్టికల్ 2.2 ని ఉల్లంఘించినట్టు అవుతుంది. అందుకు మ్యాచ్ ఫీజులో 50శాతం కోత విధించవచ్చు. కాకపోతే గుర్భాజ్ పొరపాటు అంగీకరించడంతో ఐసీసీ అతన్ని మందలించి వదిలేసింది. కానీ ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చింది. రెండేళ్లలో ఇలాంటివి నాలుగు గానీ సాధిస్తే ఆ ఆటగాడిపై నిషేధం విధించే అవకాశం ఉంది.


అయితే ఇంగ్లండ్ ని ఓడించిన ఆనందం ఒకవైపు, బీభత్సంగా ఆడిన గుర్భాజ్ ఇలాంటి చిక్కుల్లో పడటం మరొక వైపుతో గెలిచిన ఆనందం ఆఫ్గాన్ లో కనిపించలేదని కొందరు వ్యాఖ్యానించారు. వచ్చే మ్యాచుల్లోనైనా కోపం తగ్గించుకొని ఆడటం మంచిదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే మైదానంలో చాలామంది క్రీడాకారులు అత్యుత్సాహం చూపిస్తున్నారని , అటాంటి వాటికి సంబంధించి ఐసీసీ కొన్ని రూల్స్ ఎక్కువ రాసేయాలని కొందరు అంటున్నారు. లేకపోతే మైదానంలో ఒక వికెట్లు పడగానే చిన్నపిల్లల్లా అరుచుకోవడం, గొంతు చించుకోవడం, కింద పడి దొర్లడం, బ్యాట్స్ మెన్లకి వార్నింగులివ్వడం ఇవన్నీ ఐసీసీ ప్రవర్తనా నియమావళి కిందకు రావా? అని ఒక నెటిజన్ ప్రశ్నించాడు.
ఇది ఆలోచించాల్సిన విషయమేనని మరొకతను బదులిచ్చాడు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×