Abhishek Sharma Century: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న 5 టీ20ల సిరీస్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచిన టీమిండియా…వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మూడో టీ20లోనూ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ విధించిన 198 పరుగుల లక్ష్యాన్ని అభిషేక్ శర్మ సెంచరీ దెబ్బకు 6 వికెట్ల తేడాతో చేదించి సూపర్ విక్టరీ అందుకుంది. దీంతో 3-0 తేడాతో రెండు టీ20 మిగిలి ఉండగానే సిరీస్ కైవలం చేసుకుంది శ్రేయస్ అయ్యర్ సేన.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టీ20 సందర్భంగా అభిషేక్ శర్మ ఊచకోత కోశాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి, న్యూజిలాండ్ కు చుక్కలు చూపించాడు. 15 ఓవర్లలోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్, సెంచరీ చేయడానికి 20 బంతులు ఎదుర్కొన్నాడు. అయితే, సెంచరీ పూర్తయిన తర్వాత అభిషేక్ వెంటనే ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్ 38 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ, 113 పరుగులు చేశాడు. ఇందులో 11 సిక్సర్లు, 9 బౌండరీలు ఉన్నాయి. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టాడు అభిషేక్. టీ20 క్రికెట్ లో ఒకే క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగలు చేసిన ఇండియన్ గా విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. 2016లో కోహ్లీ 1614 పరుగులు సాధించాడు. తాజాగా 2026 లో అభిషేక్ శర్మ 1650 పరుగులు చేసి, అగ్ర స్థానాన్ని దక్కించుకున్నాడు. అటు వైభవ్ సూర్యవంశీ ఓపెనర్ గా బరిలోకి దిగి, 19 బంతుల్లోనే 45 పరుగులు చేశాడు. ఇందులో 4 సిక్సర్లు, 4 బౌండరీలున్నాయి.
వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్ లో న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఈ తరుణంలోనే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది న్యూజిలాండ్. అయితే ఈ లక్ష్యాన్ని 13.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి, చేదించింది. ఈ క్రమంలోనే 3-0 తేడాతో సిరీస్ ను అయ్యర్ సేన కైవసం చేసుకుంది.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన వెల్లింగ్టన్ టీ20 సందర్భంగా డారిల్ మిచెల్ రియాక్షన్ వైరల్ గా మారింది.అర్షదీప్ సింగ్ బౌలింగ్ లో ఓ బంతిని లెగ్ సైడ్ వైపు భారీ సిక్సర్ గా డారిల్ మిచెల్ మలిచాడు. ఆ సమయంలో బంతి నేరుగా వెళ్లి సిక్స్ గేట్ దగ్గర ఉన్న ఓ సెక్యూరిటీ పక్కన తగిలింది. కొంచెం తేడా వచ్చినా అతడి తల వెయ్యి ముక్కలయ్యేది. అదృష్టవశాత్తు అతడు ఎస్కేప్ అయ్యాడు. ఈ సందర్భంగా డారిల్ మిచెల్ ఒక్కసారిగా ఉలిక్కిపడి తల పట్టుకున్నాడు. అతడికి బంతి తగులుతుందేమోనని భయపడిపోయాడు. దీంతో అతడి రియాక్షన్ వైరల్ గా మారింది.