Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఇవాల్టి నుంచి పునః ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కేకేఆర్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం.. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగాయి. వర్షం కారణంగా మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో విరాట్ కోహ్లీ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం… భారీ ప్లాన్ చేసింది. విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం అందించేలా… స్కెచ్ వేసింది. స్టేడియంలోకి తెల్ల పావురాలు తీసుకువచ్చి ఎగురవేసింది.
ALSO READ: Virat Kohli Fans : కోహ్లీ కి అరుదైన గౌరవం.. చిన్నస్వామి స్టేడియంలో అన్ని 18 జెర్సీలే
చిన్నస్వామి లో తెల్ల పావురాలు
విరాట్ కోహ్లీ ఇటీవల కాలంలో టెస్ట్ రిటైర్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేశాడు. అయితే… ఫేర్వెల్ లేకుండానే తన టెస్ట్ కెరీర్ ముగించాడు విరాట్ కోహ్లీ. ఈ నేపథ్యంలో అతనికి… అరుదైన గౌరవం అందించేలా… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం భారీ ప్లాన్ చేసింది. చిటపట చినుకులు పడుతున్న నేపథ్యంలో… చిన్నస్వామి స్టేడియంలో… తెల్లటి పావురాలను వదిలింది. కోహ్లీ వైట్ జెర్సీని ప్రతిబింబించేలా ఈ పావురాలను వదిలారు.
దీంతో స్టేడియం చుట్టూ రెండు రౌండ్లు వేసాయి ఆ పావురాలు. ఇక ఈ పావురాలు స్టేడియంలో తిరగడంతో అక్కడ ఉన్న అభిమానులు కేకలు, ఈలలు వేశారు. దీనికి సంబంధించిన క్రేజీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీకి మంచి గౌరవం దక్కిందని కామెంట్స్ చేస్తున్నారు. చిన్న స్వామి స్టేడియం మొత్తం వైట్ మయం అయిందని అంటున్నారు. ఇలాంటి గౌరవం ఏ క్రికెటర్ కు కూడా దక్కలేదని చెబుతున్నారు.
ఇది ఇలా ఉండగా…. అటు విరాట్ కోహ్లీకి ట్రీట్ ఇచ్చేలా అభిమానులు కూడా 18 నెంబర్ జెర్సీలను ధరించి స్టేడియానికి వచ్చారు. విరాట్ కోహ్లీ టెస్టుల్లో వేసుకునే జెర్సీని… చిన్న స్వామి స్టేడియం బయట… విచ్చలవిడిగా అమ్మేశారు. దీనితో చాలామంది విరాట్ కోహ్లీ అభిమానులు… ఆ టీ షర్ట్ లను కొని… మ్యాచ్ చూసేందుకు వచ్చారు. అయితే వీళ్ళ ఆశలపై వరునుడు నీళ్ళు పోశాడు. భారీ వర్షం కారణంగా మ్యాచ్ అసలు ప్రారంభం కాలేదు. మరో 30 నిమిషాలు గడిస్తే తప్ప దీనిపై క్లారిటీ రాదు. ఇక ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 11 మ్యాచులు ఆడి 8 విజయాలను నమోదు చేసుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో… రెండో స్థానంలో నిలిచింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bangalore team ).
ALSO READ: Rohit Sharma Angry: కారు డామేజీ…సోదరుడిని బండ బూతులు తిట్టిన రోహిత్ శర్మ
Crazy Scenes at Chinnaswamy Stadium, Bengaluru 🏟️
Even nature turned up in white — paying tribute to King Virat Kohli 👑#RCBvsKKR pic.twitter.com/ocXsjCEdbd
— Richard Kettleborough (@RichKettle07) May 17, 2025