Pakistani player: పాకిస్తాన్ దేశ పరిస్థితి మాత్రమే కాదు.. అక్కడి క్రికెట్ బోర్డు ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. దీనికి తోడు ఆ జట్టు ఆట తీరు కూడా రోజు రోజుకు దిగజారుతోంది. ఇటీవల ముగిసిన ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని మిగిల్చింది. దాదాపు 29 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ ఐసీసీ టోర్నమెంట్ కి ఆతిథ్యం ఇచ్చినా.. ఆర్థికంగా ఇది పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి భారీ దెబ్బగా మారింది.
ఈ టోర్నమెంట్ వల్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి 7,445 కోట్ల రూపాయల నష్టం ఏర్పడినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీని ఘనంగా నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ {PCB} మూడు ప్రధాన స్టేడియాలను పునరుద్ధరించింది. ఇందుకు కావలసిన ఖర్చులు మొదట్లో ఊహించిన దానికంటే 50% ఎక్కువగా అయ్యింది. స్టేడియాల పునరుద్ధరణ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 18 బిలియన్లు.. అంటే సుమారు 4,823 కోట్లు ఖర్చు చేసింది.
అదనంగా టోర్నమెంట్ సన్నాహాలకు 3,320 కోట్లు కేటాయించింది. కానీ ఈ ఖర్చులన్నీ తిరిగి రాలేకపోయాయి. ఈ భారీ నష్టానికి ప్రధాన కారణాలు భారత జట్టు పాకిస్థాన్ లో ఆడక పోవడం, వర్ష ప్రభావం, ప్రసార హక్కుల ఆదాయం తగ్గిపోవడం, అత్యధిక నిర్వహణ ఖర్చులు అని విశ్లేషకుల అంచనా. ఈ ఈవెంట్ ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం కేవలం 498 కోట్లు మాత్రమే. అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఈ టోర్నీ నిర్వహణ వల్ల 745 కోట్ల నష్టం వాటిల్లింది.
ఆర్థిక నష్టాలతో పాటు, పాకిస్తాన్ జట్టు కూడా ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో ఈవెంట్ పై ఆసక్తి తగ్గిపోయింది. స్వదేశంలో పాకిస్తాన్ తక్కువ మ్యాచ్ లు ఆడినందున ప్రసార హక్కుల ద్వారా వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయింది. ప్రేక్షకులకు సంఖ్య కూడా తగ్గిపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై మరింత ఒత్తిడి తీసుకువచ్చింది. ఈ భారీ నష్టం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భవిష్యత్తు ప్రణాళికలపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. మరోవైపు పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు.
ఇందుకు ఉదాహరణ.. గత సంవత్సరం t20 ప్రపంచ కప్ సందర్భంగా గుర్తు తెలియని ఓ పాకిస్తాన్ క్రికెటర్.. న్యూ జెర్సీలోని ఓ క్రికెట్ వస్తువుల దుకాణంలో మూడు అత్యధిక నాణ్యత కలిగిన బ్యాట్లను కొనుగోలు చేశాడు. కానీ ఆ షాప్ యాజమానికి డబ్బులు చెల్లించలేదు. ఆ షాప్ యాజమాని వహీద్ ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. అతడు ఆటగాడిని సంప్రదించేందుకు అనేక ప్రయత్నాలు చేశారట. కానీ ఆ పాకిస్తాన్ ఆటగాడు మాత్రం ఈ షాప్ యాజమాని కాల్స్, మెసేజ్లకు సమాధానం ఇవ్వడం లేదని తెలిపాడు. ఈ మూడు బ్యాట్ల డబ్బుల విషయం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారడంతో.. కొందరు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ ని దోషిగా పేర్కొంటున్నారు. అయితే ఈ వాదనలకు ఆధారాలు లేనప్పటికీ.. తీవ్ర చర్చకు దారితీస్తోంది.
A popular Pakistani player brought 3 bats from a cricket store in New Jersey during last year's T20 World Cup.
The owner is still waiting for his payments and the player is not responding to his calls. (Waheed Khan). pic.twitter.com/PNBA1c5CeV
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 21, 2025