Michael Clarke: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇవాళ సాయంత్రం.. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన ఓపెనింగ్ సెర్మని నిర్వహించిన తర్వాత… తొలి మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ తొలి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Kolkata Knight Riders vs Royal Challengers Bangalore ) మధ్య ఫైట్ జరగనుంది. అయితే తర్వాతి మ్యాచ్… సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఉంటుంది.
Also Read: IPL 2025: ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. RCB VS KKR రద్దు ?
ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో… సన్రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad ) జట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ( Michael Clarke). ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ఛాంపియన్గా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నిలవబోతుందని… మైఖేల్ క్లార్క్ అంచనా వేశాడు. ప్రస్తుతం ఉన్న… జట్ల బలాబలాలను చూస్తే… సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు చాలా బలంగా భయంకరంగా ఉందని అంచనా వేశాడు. గతంలో ఆస్ట్రేలియా టీం ఉన్నత తరహా లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉన్నట్లు తెలిపాడు.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ అత్యంత ప్రాధాన్యమన్నారు. కెప్టెన్ గా ఉన్న ప్యాట్ కమిన్స్ కీలక నిర్ణయాలు తీసుకొని జట్టును ముందుకు తీసుకువెళ్తాడని వెల్లడించారు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎంతటి కష్టాల్లో ఉన్నా కూడా… కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఏదో ఒక ప్లాన్ వేసి కాపాడతాడని మైకేల్ క్లార్క్ పేర్కొన్నాడు. ఇందులో ఎలాంటి పక్షపాతం…. లేదని కచ్చితంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధిస్తుందని తెలిపాడు. గత సీజన్లో ఫైనల్లో ఓడిపోయిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి కచ్చితంగా విజయం సాధిస్తుందని జోష్యం చెప్పాడు మైఖేల్ క్లార్క్.
Also Read: IPL 2025: నేడు తొలి ఐపీఎల్ మ్యాచ్..టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి..?
ఆ జట్టులో ఓపెనర్లుగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అత్యంత ప్రమాదకరంగా ఉన్నారని పేర్కొన్నాడు. ఆ తర్వాత క్లాసెన్ మిడిల్ ఆర్డర్లో దుమ్ము లేపుతాడని వివరించాడు. అటు కొత్తగా ఈశాన్ కిషన్ హైదరాబాద్ జట్టులోకి వచ్చాడని.. అది చాలా అడ్వాంటేజ్ అని తెలిపాడు.. బౌలింగ్ అలాగే ఆల్ రౌండర్లు కూడా అద్భుతంగా రాణిస్తారని కొనియాడారు. ఇది ఇలా ఉండగా… సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ తొలి ఫైట్ జరగనుంది. ఈ తొలి మ్యాచ్ హైదరాబాద్ లోనే ఉప్పల్ వేదికగా జరగనుంది. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ తొలి ఫైట్ ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు జరుగనుంది. అయితే.. ఈ మ్యాచ్ నేపథ్యంలో… సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Sunrisers Hyderabad vs Rajasthan Royals ) తొలి ఫైట్ కెప్టెన్ సంజూ శాంసన్ ఆడటం లేదు. గాయం నుంచి కోలుకున్నప్పటికీ..ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగనున్నాడు.