Indian women’s Table Tennis Team in Quarter Finals(Sports news today): పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ విజయకేతనం ఎగురవేస్తుంది. తాజాగా, భారత మహిళ టేబుల్ టెన్నిస్ జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన ప్రీ క్వార్టర్ మ్యాచ్‌లో 3-2 తేడాతో రొమానియోను ఓడించింది.
మనికా బాత్రా, ఆకుల శ్రీజ, కామత్ అర్చనా గిరీశ్ తో కూడిన భారత్ మహిళ టేబుల్ టెన్నిస్ అసాధారణ ప్రదర్శన కనబర్చింది. రొమానియోను ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరడంతో భారత్ పేరిట రికార్డు నమోదైంది. ఒలింపిక్స్ చరిత్రలోనే క్వార్టర్ ఫైనల్ చేరిన తొలి భారత మహిళల టేబుల్ టెన్నిస్ టీమ్‌గా చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో మరింత ఊపందుకుంది.
ఇక, మ్యాచ్ విషయానికొస్తే.. రొమానియోతో జరిగిన మ్యాచ్‌లో మనికా బాత్రా సంచలన ప్రదర్శన కనబర్చడంతో భారత్ విజయం సాధించింది. ఈ ప్రీ క్వార్టర్స్ లో డబుల్స్‌లో జరిగిన మ్చాచ్‌లో భారత్ ద్వయం ఆకుల శ్రీజ, కామత్ అర్చనా గిరీశ్ 3-0తోరొమానియోకు చెందిన డికోను అదినాసమరా ఎలిజబెటా జోడీని ఓడించింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో భారత్ ద్వయం..1-19, 12-10, 1-17తో విజయం సాధించింది.
తొలి గేమ్‌తో పాటు రెండో గేమ్‌లోనూ గట్టి పోటీ ఇచ్చినా రొమానియో ద్వయం ఆఖరి గేమ్‌లో మాత్రం చేతులెత్తేసింది. సింగిల్స్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో మనికా బత్రా 3-0తో రొమానియోకు చెందిన బెర్నడెట్‌ను ఓడించింది. 1-15, 1-17, 1-17లో మనికా బత్రా వరుసగా మూడు గేమ్‌లలో సునాయస విజయాన్ని అందుకుంది.
ఇక, మూడో సింగిల్స్ మ్యాచ్‌లో మాత్రం భారత్‌కు షాక్ తగిలింది. ఆకుల శ్రీజ 23 తేడాతో రొమానియోకు చెందిన సమారా ఎలిజబెటా చేతిలో ఓడిపోయింది. తొలి గేమ్‌లో శ్రీజ 118తో గెలవగా..రెండో గేమ్‌లో 411తో ఓడిపోయింది. మూడో గేమ్‌ను 117తో గెలిచిన శ్రీజ.. చివరి రెండు గేమ్స్‌లో 611, 811 తేడాతో ఓటమి చెందింది.
Share