Bihar Bomb threat news today(Live tv news telugu): బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌కు బెదిరింపు మెయిల్ పంపించిన నిందితుడిని కోల్‌కతాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, బీహార్ సీఎం కార్యాలయానికి బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. సీఎం ఆఫీస్ ను బాంబుతో పేల్చేస్తామని, బీహార్ స్పెషల్ పోలీసులు కూడా తమను అడ్డుకోలేరని ఈ మెయిల్స్ లో హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, ఈ బెదిరింపు ఈ మెయిల్స్ పై బీహార్ పోలీసులు, ఉగ్రవాద వ్యతిరేక దళం దర్యాప్తు చేపట్టాయి. అదే విధంగా సచివాలయ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎట్టకేలకు మంగళవారం బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Share