Wrestler Nisha Dahiya in Paris Olympics(Sports news in telugu): ఒలింపిక్స్‌లో పతకం సాధించడానికి నానాకష్టాలు పడతారు ఆటగాళ్లు. ఇందుకోసం ఏళ్ల తరబడి ప్రాక్టీసు చేస్తారు. నిద్రలేని రాత్రిళ్లు సైతం గడుపుతారు. అంతా ఓకే అయి తర్వాత సెలక్షన్ ఒకెత్తు. పోటీల్లో పాల్గొనేసరికి గాయాలు సమస్య. సరైన సమయంలో ఆట ఆడలేక పోయానన్న బాధతో ఏడుస్తూ గేమ్ నుంచి తప్పుకుంటున్నారు. సోమవారం జరిగిన ఆటల్లో బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్, రెజ్లర్ నిషాదహియాలకు అలాంటి సమస్యే ఎదురైంది.
సోమవారం రాత్రి 68 కేజీలో విభాగంలో రెజ్లింగ్‌లో భారత్ క్రీడాకారిణి నిషాదహియా- ఉత్తరకొరియాకు చెందిన పాక్ సోల్ గమ్ మధ్య పోరు జరిగింది. ఆది నుంచి నిషా దూకుడుగా ఆడింది. ప్రత్యర్థిని ముప్పు తిప్పలు పెట్టి లీడ్ సాధించింది. బ్రేక్ తర్వాత అదే జోరు కొనసాగింది. ఆట మరో 33 సెకన్లు ఉందనగా కుడి చేతి వేలికి గాయమైంది.
చేతి వేలుకు బ్యాండేజ్ వేసుకుని మరీ ఆడింది. ప్రత్యర్థిని కిందకు వంచే క్రమంలో షోల్డర్ సమస్య వెంటాడింది. అప్పటివరకు లీడ్‌లో ఉంది నిషా. భారత ప్లేయర్ వీక్ నెస్‌ని తనకు అనుకూలంగా మార్చు కుంది కొరియా క్రీడాకారిణి. అయినా సరే నొప్పిని దిగమింగుతూ పోరాటం సాగించింది నిషా.
ALSO READ: లక్ష్యం తప్పింది.. కాంస్య పతకపోరులో లక్ష్యసేన్ ఓటమి
ఒంటి చేత్తో ఆడలేక, షోల్డర్ నొప్పి ఎక్కువ కావడంతో వెక్కి వెక్కి ఏడుస్తూ టోర్నీ నుంచి నిష్క్రమించింది నిషా దహియా. నొప్పి కారణంగా డ్రాపయినా కోట్లాదిమంది అభిమానుల మనసు గెలుచుకుంది నిషా దహియా. మరోవైపు రెజ్లర్‌ను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడానికి ఉత్తర కొరియా ఇలాంటి ఎత్తు గడలను ఎత్తుకుందని నిషా కోచ్ ఆరోపించారు.
మరోవైపు బ్యాడ్మింటన్‌లో కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లో లక్ష్యసేన్‌ను కుడి చేతికి గాయం అయ్యింది. ఆట మధ్యలో రెండుసార్లు బ్రేక్ తీసుకుని బ్యాండేజ్ కట్టుకుని మరీ ఆడాడు. అయినా ఫలితం లేక పోయింది. ఈ రెండు మ్యాచ్‌లను తిలకించిన అభిమానుల మనసును వీరిద్దరూ గెలుచుకున్నారు.
This is painful to watch! Nisha Dahiya was going so well till her injury!
You still fought like a warrior! 👏👏#lakshaysen #Badminton #INDvSL #ODIs #GautamGambhir #ShreyasIyer #NishaDahiya #RohitSharma
— Cricketism (@MidnightMusinng) August 5, 2024