BigTV English

Sheetal Devi: ఆరంగేట్రంలోనే అదరగొట్టిన ‘శీతల్’

Sheetal Devi: ఆరంగేట్రంలోనే అదరగొట్టిన ‘శీతల్’

Paris Paralympics 2024 Day 1 Highlights Sheetal Devi Finish Second in Ranking Round:  పారా ఒలింపిక్స్ లో కొన్ని ఆశాజనక పరిణామాలు కనిపిస్తున్నాయి. పతకాలు వచ్చే సూచనలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్మ్ లెస్ ఆర్చర్ శీతల్ దేవి అరంగేట్రంలోనే అదరగొట్టింది. మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్ ర్యాంకింగ్ రౌండ్‌లో అద్భుత ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచింది.


రెండు చేతులు లేవు, అయినా సరే కాలు, భుజం సాయంతో లక్ష్యానికి గురిపెట్టిన శీతల్ దేవి పతకానికి దగ్గరగా వెళ్లింది. 17 ఏళ్ల జమ్ము కాశ్మీర్ అమ్మాయి అయిన శీతల్ 720 పాయింట్లకు గాను 703 సాధించి, ఏకంగా ప్రీక్వార్టర్ లో తలపడే అవకాశం కొట్టేసింది. ఇది ఆమె కెరీర్ లోఅత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన. ఇకపోతే తుర్కియేకు చెందిన ఒజ్నూర్ గిర్డి 704 పాయింట్లతో ప్రపంచ రికార్డ్ సాధించడమే కాదు, అగ్రస్థానంలో నిలిచింది.

Also Read: విరాట్ కొహ్లీకే.. ప్రకాష్ రాజ్ కౌంటర్!


మరో భారత పారా ఆర్చర్ సరిత 682 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇక భారత షట్లర్లు తరుణ్, సుహాస్, సుకాంత్ శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్ లో తులసిమతి, గ్రూప్ బీలో మనీషా, గ్రూప్ సిలో పలక్ కొహ్లీ, గ్రూప్ ఏ లో నిత్యశ్రీ అందరూ  తొలిగేమ్ లో విజయం సాధించి ముందడుగు వేశారు. పారా సైక్లింగ్ లో జ్యోతి నిరాశపరిచింది. చివరి స్థానంలో నిలిచింది.

Related News

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

IND Vs PAK : టీమిండియా పై పాకిస్తాన్ లేడీ సంచలన వ్యాఖ్యలు.. మీరు ఇంటికి వెళ్లిపోండి అంటూ!

IND Vs PAK : మరోసారి రెచ్చిపోయిన పాకిస్థాన్..వంక‌ర బుద్దులు ఏ మాత్రం పోలేదుగా !

Haris Rauf’s wife : హారిస్ రౌఫ్ భార్యకు పెను ప్రమాదం… తుక్కుతుక్కు అయిన కారు !

SL VS PAK : ఆసియా క‌ప్ లో నేడు శ్రీలంక‌-పాక్ మ‌ధ్య పోరు.. చావో రేవో..!

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

Big Stories

×