Big Stories

Olympics 2024: ఒలింపిక్స్‌కి పారిస్‌ రెడీగా ఉందా..?

Paris Ready For The 2024 Olympic Games: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచదేశాలన్ని బిక్కుబిక్కుమంటూ బ్రతుకును వెల్లదీశాయి.అంతేకాకుండా కరోనా చాలా మందిని బలితీసుకుంది. అందులో చాలామంది నిరాశ్రయులు అయ్యారు.దీని కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది.దీని కారణంగా ప్రపంచ దేశాల్లో టైమ్‌కి జరగాల్సిన పనులు పూర్తిగా నిలిచిపోయాయి.అందులో మెయిన్‌గా ఒలింపిక్స్‌.కరోనా కారణంగా 2021లో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌ దాదాపు ఏడాది పాటు వాయిదా పడింది. దీంతో టోక్యోలో అభిమానులు లేక సందడి లేకుండా పోయింది. ఆడియెన్స్‌ను స్టేడియం లోపలికి అనుమతించకపోవడమే ఇందుకు కారణం. 19s లో రెండుసార్లు ఆతిథ్యం ఇచ్చిన ఫ్రాన్స్. ఇప్పుడు సరిగ్గా వందేళ్ల తరువాత మరోసారి ఈ క్రీడలకు వేదికగా మారుతోంది.

- Advertisement -

ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌ని అత్యంత వైభవంగా జరిపేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పారిస్‌లో ప్రవహించే సెన్ నది ఈ ఒలింపిక్స్‌కు మెయిన్ అట్రాక్షన్‌గా నిలవనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ క్రీడలు స్టార్ట్ కానున్నాయి. ఈ క్రీడల స్టార్టింగ్‌ సెలబ్రేషన్స్‌ గ్రౌండ్‌లో కాకుండా నదిలో జరగబోతున్నాయి. వీటితో పాటు మారథాన్‌ స్విమ్మింగ్ ట్రయథ్లాన్‌ స్విమ్మింగ్ తదితర ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ పోటీలకు సెన్ వేదిక కానుంది.కానీ ఇందులోని నీటి నాణ్యత ప్రమాదకర స్థాయిలో ఉండటం నిర్వాహకుల ప్రణాళికలను దెబ్బతిసేదే. వరద, మురికి నీరు కారణంగా ఈ నదిలో 100 ఏళ్ల కింద స్నానం చేయడం నిషేధించింది. ఇప్పటికి ఇందులో ఈత కొట్టడం అథ్లెట్లకు శ్రేయస్కరం కాదనే వాదన వినిపిస్తోంది. ఒకవేళ పోటీల టైమ్‌కి కూడా పరిస్థితి ఇలాగే ఉంటే ప్రత్యామ్నాయ వేదికల్లో ఈవెంట్స్‌ని నిర్వహించే ఛాన్స్ ఉంది.

- Advertisement -

Also Read: ఆటలో రాష్ట్రపతి ముర్ము, కాసేపు సైనాతో..

పార్లమెంట్‌ని రద్దు చేస్తూ గత నెలలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ తీసుకున్న డెసీషన్‌తో అక్కడి పరిస్థితి భిన్నంగా మారింది. రెండు దఫాల ఎన్నికల్లో ఏ పార్టీకి ఆధిక్యత రాకపోవడంతో రాజకీయ అనిశ్చితి నెలకొనడం క్రీడల నిర్వాహణ సరైన నిర్ణయం కాదని గత నెలలో అభిప్రాయపడ్డారు.వేదికలు, క్రీడా గ్రామాల ఏర్పాటులో భాగంగా వేలాది మంది నిర్వాసితులను సమీపంలోని భవనాల నుంచి ఖాళీ చేయించడంపైనా విమర్శలు గుప్పుమంటున్నాయి. ఈ వేసవిలో పారిస్‌లో సగటు కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయనే అంచనాలు అథ్లెట్లకు ఇబ్బందులు కలిగించేవిగా కనిపిస్తున్నాయి. ఉచిత ప్రజారవాణా సౌకర్యం కల్పిస్తామని ఒలింపిక్ వేదికల వరకు మెట్రో పొడగిస్తామని ఒలింపిక్స్‌ కోసం బిడ్ దాఖలు చేసినప్పుడు ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రజా రవాణా ఛార్జీలు రెండింతలు పెరిగాయి. మెట్రో సౌకర్యం వెసులుబాటు పూర్తిగా అందుబాటులోకి రాలేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News