Champions Trophy 2025: మన ప్రత్యర్థి దేశం పాకిస్తాన్ ను ( Pakisthan ) ఒక ఆట ఆడుకుంటున్నారు నెటిజెన్స్. మున్సిపాలిటీ యూనిఫామ్ వేసుకుని… పాకిస్తాన్ క్రికెటర్లు రచ్చ చేస్తున్నారని దారుణంగా ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. గతంలో పుచ్చకాయ డ్రెస్స్ వేసుకున్న పాకిస్తాన్ క్రికెటర్లు… ఈ సారి మున్సిపాలిటీ యూనిఫాం వేసుకుని… క్రికెట్ ఆడుతున్నారంటూ… సెటైర్లు పేలుతున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ( ICC Champions Trophy 2025 ) భాగంగా… తాజాగా పాకిస్తాన్ జట్టుకు ( Pakisthan ) సంబంధించిన జెర్సీ రివిల్ చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కు ఇప్పటికే తమ జట్టును ప్రకటించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board )… తాజాగా జెర్సీ ని కూడా రివిల్ చేయడం జరిగింది.
Also Read: Team India: కుంభమేళాలో అఘోరల క్రికెట్.. రోహిత్, కోహ్లీల మధ్య చిచ్చు ?
ఇటీవల గడాఫీ స్టేడియాన్ని సిద్ధం చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board )… అదే స్టేడియంలో…. జెర్సీ లాంచ్ ఈవెంట్ కూడా నిర్వహించింది. స్టేడియంలోనే గ్రాండ్ గా ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా.. పాకిస్తాన్ కొత్త కెప్టెన్ రిజ్వాన్… తో పాటు పాకిస్తాన్ క్రికెటర్లందరూ…. కొత్త జెర్సీ ధరించి స్టేడియంలో రచ్చ చేశారు. జెర్సీ పైన స్వెటర్లు వేసుకొని… స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చిన పాకిస్తాన్ క్రికెటర్ లో…. ఆ తర్వాత ఆ స్వెటర్లను విప్పేసి… జెర్సీని రివిల్ చేశారు.
అయితే పాకిస్తాన్ క్రికెటర్లు కొత్త జెర్సీని చూపించడంతో… అక్కడే ఉన్న… ఆ జట్టు అభిమానులు కేరింతలు అలాగే చప్పట్లు కొడుతూ… ఎంజాయ్ చేశారు. అయితే… నిత్యం ట్రోలింగుకు గురయ్యే పాకిస్తాన్ టీమ్… జెర్సీ విషయంలో కూడా.. దారుణంగా ట్రోలింగుకు గురవుతోంది. పాకిస్తాన్ జెర్సీ ని ( Pakistan Jersy ) చూసి… దారుణంగా కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఒరేయ్ అది… జెర్సీనా లేక మున్సిపాలిటీ యూనిఫామా ? అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.
ఇది ఎక్కడి టీం రా బాబు… మీరు క్రికెట్ ఆడతారా? లేక స్టేడియం బయట ఊడ్చుతారా…? అంటూ పచ్చి బూతులతో రెచ్చిపోతున్నారు నేటిజన్స్. ఇటు ఇండియన్ ఫ్యాన్స్ కూడా… పాకిస్తాన్ జెర్సీపై సెటైర్లు పేల్చుతున్నారు. సందట్లో సడే మీ అలాగా… పాకిస్తాన్ ప్లేయర్లను ఒక ఆట ఆడుకుంటున్నారు. అయితే ఈ నెగిటివ్ కామెంట్లను పట్టించుకోకుండా… పాకిస్తాన్ క్రికెటర్లు అలాగే ఆ దేశ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
Also Read: FIFA: పాక్ కు బిగ్ షాక్.. ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను సస్పెండ్ చేసిన ఫిఫా !
స్వదేశంలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటును ( ICC Champions Trophy 2025 ).. ఈ జెర్సీలో గెలుచుకుంటామని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు అక్కడి అభిమానులు. ఇది ఇలా ఉండగా… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి మొత్తం మ్యాచులు పాకిస్తాన్ లో జరగాల్సి ఉండేది. కానీ టీమిండియా కారణంగా హైబ్రిడ్ మోడల్ లో ఈ టోర్నమెంట్ జరుగుతోంది. అంటే సగం మ్యాచ్ లు పాకిస్తాన్ లో అలాగే సగం మ్యాచులు దుబాయ్ లో జరుగుతాయి.
Superstars onstage at the Gaddafi Stadium 🌟
The moment Pakistan team unveiled their official jersey for the ICC Champions Trophy 2025 👏 pic.twitter.com/yiPGU5MT0z
— Pakistan Cricket (@TheRealPCB) February 7, 2025