PBKS vs MI Qualifier 2 : ఐపీఎల్ 2025 సీజన్ ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్వాలిఫయర్ 1 లో విజయం సాధించి ఫైనల్ కి చేరుకుంది. క్వాలిఫయర్ 2 మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య ఇవాళ రాత్రి 7.30 గంటలకు జరగాల్సి ఉంది. అయితే ఆ మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం అవుతోంది. అయితే ఇదే సందర్భంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులు మాత్రం సంబురాలు జరుపుకుంటున్నారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కురిస్తే.. పంజాబ్ కింగ్స్ ఫైనల్ కి చేరుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పంజాబ్ కింగ్స్ ఫైనల్ కి చేరుకుంటే.. ఆర్సీబీ టైటిల్ సాధిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. వర్షం కారణంగా రద్దు అయితే.. మ్యాచ్ పాయింట్ల టేబుల్స్ ఆధారంగా పంజాబ్ కింగ్స్ ముందంజలో ఉండటంతో ఫైనల్ కి చేరుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో తక్కువగా ఉండటంతో ఇంటిదారి పట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆర్సీబీ అభిమానులు సంబురాలు జరుపుకుంటున్నారు. మరోవైపు అంబానీ ఫ్యామిలీ మాత్రం ఆందోళనలో ఉంది.
Also Read : MI VS PBKS, Qualifier 2: టాస్ గెలిచిన పంజాబ్..మోడీ స్టేడియంలో భారీ వర్షం.. షాక్ లో ముంబై
ఎట్టకేలకు మ్యాచ్ ప్రారంభం అయింది. ముంబై ఇండియన్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ 8 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. దీంతో ముంబై కి ఎదురుదెబ్బ తగిలింది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్ కి చేరుకొని.. తమ తొలి టైటిల్ కోసం పోరాడుతోంది. కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ నాయకత్వంలో ఆర్సీబీ ఈ సీజన్ లో అద్భుతంగా రాణించింది. గతంలోమూడు ఫైనల్స్ ఓడిపోయిన వాస్తవం.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం పై సందేహాలను రేకెత్తిస్తోంది. ఐపీఎల్ చరిత్రలో తొలి టైటిల్ గెలవడానికి ఆర్సీబీ కేవలం ఒకే ఒక్క అడుగు దూరంలోనే ఉంది. దీంతో 17 ఏళ్ల కల జూన్ 03న నెరవేరవచ్చు. కానీ పెద్ద ప్రశ్న ఏంటంటే..? ఈ సారీ ఆర్సీబీ టైటిల్ గెలవగలదా..? కానీ ఈ ప్రశ్న పై ప్రతీ ఒక్కరికీ భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఐపీఎల్ 2015 18వ సీజన్ చివరి ప్రయాణం వైపు వెళ్తోంది. ఈ టోర్నమెంట్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి జట్టు ఫైనల్ కి వచ్చింది. రజత్ పాటిదార్ సేన తొమ్మిదేళ్ల తరువాత ఐపీఎల్ లో ఫైనల్ కి చేరుకుంది. బెంగళూరు జట్టు తన తొలి ఐపీఎల్ టైటిల్ ని గెలుచుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తుంది. క్రికెట్ లో ఏదైనా సాధ్యమే.. క్రికెట్ లో చివరి బంతి వేసే వరకు ఏమి చెప్పలేమని చెబుతుంటారు. ఎందుకంటే..? అన్ని అంచనాలు తలకిందులయ్యే ఛాన్స్ ఉంది. క్రికెట్ లో కానీ.. క్రీడా నిపుణులు ప్రస్తుత పరిస్థితుల ప్రకారం.. అంచనా వేస్తుంటారు. ఇది కూడా సాధ్యమేనని ఆర్సీబీ ఫామ్, జట్టు ఆటగాళ్లను పరిశీలిస్తే.. ఈ ఏడాది తన తొలి టైటిల్ ను గెలుచుకోగలదనే ఊహగానాలు ఉన్నాయి. కానీ బెంగళూరు అలా చేయడంలో విఫలం కావచ్చు.
— Out Of Context Cricket (@GemsOfCricket) June 1, 2025
Are yaar Indra dev ki pooja karna reh gayi thi pic.twitter.com/2PjuUfbmfh
— Out Of Context Cricket (@GemsOfCricket) June 1, 2025