PBKS vs RCB Qualifier 1: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్ కు దూసుకు వెళ్లింది. ఎవరు ఊహించని విధంగా క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ ఆడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు… నేరుగా ఫైనల్ కి వెళ్ళింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో ఇప్పటివరకు రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టు… మూడుసార్లు ఫైనల్ కి వెళ్ళగా ఇది నాలుగో సారి కావడం విశేషం.
పంజాబ్ చిత్తు చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ లో మొదట బౌలింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. పంజాబ్ ఆటగాళ్లను కట్టడి చేసింది. కేవలం 14.1 ఓవర్లలోనే 101 పరుగులకు పంజాబ్ ఆటగాలను చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ యాజమాన్యం. పంజాబ్ కింగ్స్ జట్టుకు సంబంధించిన ఏ ఒక్క ప్లేయర్ కూడా సరిగ్గా ఆడలేదు. డ్రెస్సింగ్ రూమ్ లో ఏదో పార్టీ ఉన్నట్లే అందరూ బ్యాటింగుకు రావడం వెంటనే వెళ్లిపోవడం జరిగింది.
దీంతో 101 పరుగులకే ఆల్ అవుట్ అయింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఇక 102 పరుగుల లక్ష్యాన్ని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అవలీలగా చేదించింది. కేవలం రెండు వికెట్లు నష్టపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 10 ఓవర్లలో మ్యాచ్ ఫినిష్ చేసి నేరుగా ఫైనల్ కు దూసుకు వెళ్ళింది. రాయల్ చాలెంజెర్స్ బెంగళూరు జట్టు ఆటగాడు ఫిలిప్స్ సాల్ట్ అద్భుతమైన బ్యాటింగ్ చేసి జట్టును గెలిపించాడు.
పంజాబ్ జట్టు పైన కెప్టెన్సీ చేసిన విరాట్ కోహ్లీ
పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో… కెప్టెన్సీ పూర్తి బాధ్యతలను విరాట్ కోహ్లీ తీసుకున్నట్లు స్పష్టమైంది. స్లిప్ లో ఉన్న విరాట్ కోహ్లీ ఫీలింగ్ సెట్టింగ్ అలాగే ఏ బౌలర్కు బౌలింగ్ ఇవ్వాలి..? ఫీల్డర్స్ ను ఎక్కడ పెట్టాలి అనేది మొత్తం చూసుకున్నాడు. విరాట్ కోహ్లీ కే పూర్తిగా కెప్టెన్సీ ఇచ్చినట్లే కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది.
అదరగొట్టిన బెంగళూరు ఆటగాడు సుయాస్ శర్మ
పంజాబ్ కింగ్స్ జట్టు పైన బెంగుళూరు ఆటగాడు సుయాస్ శర్మ అదరగొట్టాడు. కేవలం 3 ఓవర్సు వేసిన సుహాస్ శర్మ 17 పరుగులు ఇచ్చి ఏకంగా మూడు కీలక వికెట్లు తీశాడు. వికెట్ తీసిన ప్రతిసారి నేనున్నా అంటూ తన సైగలతో రెచ్చిపోయాడు సూయష్ శర్మ. దీంతో అతనికి సంబంధించిన ఎమోషన్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
డీలా పడిపోయిన చాహల్ లవర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో జరిగిన క్వాలిఫైయర్ వన్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ దారుణంగా ఓడిపోయింది. ఏకంగా 8 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతులో చిత్తయింది పంజాబ్ కింగ్స్. అయితే ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ దారుణంగా ఓడిపోయిన నేపథ్యంలో… చాహల్ ప్రియురాలు RJ మహ్వష్ చాలా డీలా పడిపోయినట్లు కల్పించారు.
VIRAT KOHLI – THE MAN OF RCB IN FIELD..!!! 🐐 pic.twitter.com/M3J79jRIBV
— Johns. (@CricCrazyJohns) May 29, 2025