PBKS vs RCB, Qualifier 1: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో…. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చరిత్ర సృష్టించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో పంజాబ్ కింగ్స్ జట్టును చిత్తు చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు… నేరుగా ఫైనల్స్ కు వెళ్ళింది. ఏకంగా 8 వికెట్ల తేడాతో… పంజాబ్ జట్టు పైన గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు…. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో ఫైనల్ కు దూసుకు వెళ్ళింది. దీంతో జూన్ మూడవ తేదీన… ఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.
Also Read: RCB IPL Trophy: బెంగుళూరుకు బంపర్ ఆఫర్.. ఈ సెంటిమెంట్ ప్రకారం RCB కే టైటిల్
102 పరుగుల లక్ష్యాన్ని… కేవలం 10 ఓవర్లలో ఫినిష్ చేసి… దుమ్ము లేపింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. దీంతో నేరుగా ఫైనల్ కి వెళ్ళింది. ఇలా.. ఇప్పటివరకు నాలుగోసారి ఫైనల్ కు వెళ్లిన జట్టుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు రికార్డు సృష్టించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్ కి వెళ్లడంతో దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి.
నాలుగో సారి ఫైనల్స్ కు చేరిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నేరుగా ఫైనల్ గా వెళ్ళింది. అయితే ఐపీఎల్ టోర్నమెంట్లో ఇలా ఫైనల్ కు చేరడం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు నాలుగోసారి. గతంలో కూడా మూడుసార్లు ఫైనల్ కి వెళ్ళింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభమైన నుంచి 2009, 2011 అలాగే 2016 సంవత్సరాలలో ఫైనల్ కు చేరింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. అయితే 2016 సమయంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు చేతిలో దారుణంగా ఓడిపోయి ఇంటి జారి పట్టింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఇక ఇప్పుడు 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరోసారి ఫైనల్ కు చేరింది. క్వాలిఫైయర్ 2 లో గెలిచిన జట్టుతో జూన్ మూడవ తేదీన ఫైనల్ ఆడనుంది రాయల్ చాలెంజ్ బెంగళూరు.
పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 14.ఓవర్లలో 101 పరుగులు చేసి కుప్పకూలింది. ఇక ఈ లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి ఛేదించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఫిలిప్స్ సాల్ట్ 56 పరుగులతో రాణించడంతో… ఫైనల్ కు దూసుకు వెళ్ళింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ముఖ్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు బౌలర్లు భువనేశ్వర్, యష్ దయాల్, హాజల్ వుడ్, సూయాష్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేశారు. పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లను.. 50 పరుగుల లోపే కట్టడి చేసే ప్రయత్నం చేశారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు సక్సెస్ కావడంతో… అవలీలగా ఫైనల్ చేరుకోవడం జరిగింది.
Also Read: RCB Fan: దిగ్వేశ్ కు నరకం చూపిస్తున్న RCB ఫ్యాన్స్.. ఎయిర్ పోర్టులో కూడా ర్యాగింగ్