Mohsin Naqvi – Brendan McCullum : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ (India vs England) మధ్య టి20 సిరీస్ ఇటీవల ముగిసింది. ఇక ఇవాల్టి నుంచి వన్డే సిరీస్ కూడా ప్రారంభమైంది. ఇండియా పై అద్భుతంగా రాణించిన ఇంగ్లాండ్… టి20 సిరీస్ కైవసం చేసుకుంది. అయితే ఇంత మంచి హ్యాపీ మూమెంట్ లో ఆ జట్టు కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టెస్ట్ కెప్టెన్సీ నుంచి అతడిని తప్పిస్తూ ఘోరంగా అవమానించింది ఇంగ్లాండు క్రికెట్ బోర్డు. ఈ నేపథ్యంలో కేవలం టి20లతో పాటు వన్డేలకు మాత్రమే ఇంగ్లాండ్ జట్టు కోచ్ గా పని చేయనున్నాడు బ్రెండన్ మెక్‌కల్లమ్ (Brendan McCullum). అయితే ఈ న్యూస్ తెలియగానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రంగంలోకి దిగింది. తమ జట్టుకు హెడ్ కోచ్ గా నియామకం చేస్తామని… వెంటనే ఇంగ్లాండు ను వదిలి తమ దేశానికి రావాలంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇందులో భాగంగానే స్వయంగా బ్రెండన్ మెక్‌కల్లమ్ కు మొహ్సిన్ నఖ్వీ (PCB chairman Mohsin Naqvi) ఫోన్ చేశారు. కానీ మెక్‌కల్లమ్ మాత్రం అతడి ఫోన్ లిఫ్ట్ చేయకుండా.. ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి ఘోర అవమానం ఎదురయింది. ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్ నుంచి తప్పుకున్న బ్రెండన్ మెక్‌కల్లమ్ అతడి పరువు తీశాడు. ఇంగ్లాండ్ ను వదిలేసి పాకిస్తాన్ జట్టుకు కోచ్ గా నియామకం చేస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చారు మొహ్సిన్ నఖ్వీ. ఈ మేరకు స్వయంగా మొహ్సిన్ నఖ్వీనే… ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ కు ఫోన్ చేశారు. అయితే అతనికి ఫోన్ లిఫ్ట్ చేయకుండా… ఆ ఆఫర్ రిజెక్ట్ చేశారట బ్రెండన్ మెక్‌కల్లమ్. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కోచ్ గా పని చేయడం కంటే… ఇంట్లో మూలకు కూర్చోవడం బెటర్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారట. ఓ మెయిల్ ద్వారా పాకిస్తాన్ ఇచ్చిన ఆఫర్లు రిజెక్ట్ చేస్తున్నట్లు స్పష్టం చేశారట బ్రెండన్ మెక్‌కల్లమ్. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు ఘోర అవమానం ఎదురయింది.
చాలా రోజుల నుంచి పాకిస్తాన్ క్రికెట్ జట్టు చెత్త ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటివరకు ఉన్న కోచ్ లను తప్పించి… విదేశీ క్రికెటర్లను కోచులుగా నియామకం చేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే చాలామంది నుంచి విదేశీ క్రికెటర్ల నుంచి దరఖాస్తులు కూడా తీసుకుంటోంది. ఇలాంటి తరుణంలోనే బ్రెండన్ మెక్‌కల్లమ్ కు ఆఫర్ ఇచ్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. కానీ అతడు రిజెక్ట్ చేయడం జరిగింది.
Also Read: Munaf Patel On Dhoni Hookah Party: నోరు ఉన్న ప్రతీ వెధవా
మాట్లాడటమే..ధోనీ ‘హుక్కా’ సీక్రెట్ పై మునాఫ్ సంచలనం
According to Sources- PCB chairman Mohsin Naqvi called Brendan McCullum to offer him the Pakistan coaching job.
but McCullum reply to Mohsin- "Bhakk TMKC"
More details awaited pic.twitter.com/BeTPDQ37vQ
— Space Recorder (@1spacerecorder) July 12, 2026