BigTV English

Gaddafi Stadium: పాకిస్థాన్ పరువు పాయె..స్టేడియంలో అన్ని నీళ్లే..?

Gaddafi Stadium: పాకిస్థాన్ పరువు పాయె..స్టేడియంలో అన్ని నీళ్లే..?

Gaddafi Stadium: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎన్నో ఆశలతో ఓ స్టేడియాన్ని నిర్మించింది. ఆ స్టేడియానికి ఓ కొత్త రూపాన్ని తీసుకువచ్చింది. కానీ ఇప్పుడు ఆ స్టేడియం వల్లే పాకిస్తాన్ పరువు మొత్తం పోతుంది. అదే లాహోర్ లోని గడాఫీ స్టేడియం. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఈవెంట్ కి ముందు ఈ స్టేడియాన్ని 1000 మంది కార్మికుల సహాయంతో పునర్నిర్మించారు. ఈ పనికి మొత్తం 117 రోజులు పట్టింది. అంతేకాదు ఈ స్టేడియం పునర్నిర్మాణానికి 1800 కోట్లు ఖర్చు చేశారు.


Also Read: Anushka Sharma: రోహిత్ కొడుకును ముద్దాడిన అనుష్క శ‌ర్మ..!

మొదట ఈ స్టేడియం నిర్మాణం కోసం 1300 కోట్లను కేటాయించింది పిసిబి.. ఆ తర్వాత ఆ ఖర్చు 1800 కోట్లకు చేరుకుందని తెలిపింది. అంత ఖర్చు చేసి పునర్నిర్మించిన ఈ స్టేడియం.. ఇప్పుడు పాకిస్తాన్ పరువుతీస్తోంది. కారణం ఏంటంటే.. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం జరగాల్సిన ఆస్ట్రేలియా – ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. లాహోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా ఆఫ్గనిస్తాన్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఈ మ్యాచ్ ఇరుజట్లకు కీలకం.


ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు 50 ఓవర్లలో 273 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యారు. సెడికుల్లా అటల్ 85 రన్స్ చేసి టాప్ స్కోరర్ గారు నిలిచాడు. మరో బ్యాటర్ అజ్మతుల్లా ఓమర్జాయ్ కూడా 67 పరుగులు చేశాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ డావర్సుయిస్ 3, జాన్సన్, అడమ్ జంపాలకు రెండేసి వికెట్లు దక్కాయి. అలాగే నేతన్ ఎల్లీస్, మ్యాక్స్వెల్ కూడా చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా బ్యాటరు దూకుడుగా ఆడారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 12.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 19 రన్స్, ట్రావీస్ హెడ్ 59 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అదే సమయంలో వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో ఈ మ్యాచ్ ని రద్దు చేశారు. అయితే వర్షం ధాటికి ఈ గడాఫీ స్టేడియంలోని బాత్రూం వద్ద ఉన్న పైకప్పు లీక్ అయ్యింది.

Also Read: Hardik Pandya: కుంగ్ ఫూ పాండ్యా….. కేన్ మామకు వెన్నులో వణుకు పుట్టించాడు?

మరోవైపు స్టేడియం లో కూడా భారీగా నీరు చేరింది. తగినంత సాపర్స్ లేకపోవడం వల్ల, డ్రైనేజీ నిర్వహణ సరిగా లేని కారణంగా భారీగా నీరు నిలిచింది. ఈ మ్యాచ్ రద్దయిన నేపథ్యంలో ప్రేక్షకులకు టికెట్ ధరలను తిరిగి చెల్లించింది మేనేజ్మెంట్. ఇక వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు కావడంతో ఆస్ట్రేలియా సెమి ఫైనల్ లో ప్లేస్ కొట్టేసింది. ఇరుజట్లకు 1-1 పాయింట్లు ఇచ్చేశారు. ఇరు జట్లకు కీలకమైన ఈ మ్యాచ్ కి వర్షం అడ్డం కలిగించవద్దని అభిమానులు కోరుకున్నప్పటికీ.. వర్షం ఆటంకం కలిగించింది. ఇక ఇదే స్టేడియంలో సౌత్ ఆఫ్రికా – న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీస్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో తీవ్ర విమర్శలు వెళ్లవెత్తుతున్నాయి.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×