E-Paper
Advertisement

Mohsin Naqvi: రెండు గువ్వలు ప‌గిలేలా ఇండియా స‌మాధానం..దొంగ‌చాటున జారుకున్న‌ మొహ్సీన్ న‌ఖ్వీ

Mohsin Naqvi: రెండు గువ్వలు ప‌గిలేలా ఇండియా స‌మాధానం..దొంగ‌చాటున జారుకున్న‌ మొహ్సీన్ న‌ఖ్వీ
Advertisement

Mohsin Naqvi:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో పాకిస్తాన్ తాటతీసింది టీమిండియా. నిన్న కొలంబో వేదికగా జరిగిన పాకిస్తాన్ జట్టుకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది ఇండియా. ఈ దెబ్బకు మ్యాచ్ మధ్యలోనే దొంగ చాటున జారుకున్నాడు పాకిస్తాన్ క్రికెట్ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ. 30 పరుగులు చేసేలోపే దాదాపు పాకిస్తాన్ సగానికి పైగా వికెట్లు కోల్పోయింది. బుమ్రా , హ‌ర్ధిక్ పాండ్యా దెబ్బకు పాకిస్తాన్ కకావికలమైంది. ఇక అప్పుడే ఓటమి డిసైడ్ అయిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ( PCB Mohsin Naqvi), ప్రేమ దాస స్టేడియాన్ని వదిలి బయటకు వచ్చేశారు. తన కారులో మెల్లగా దొంగచాటుగా జారుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Also Read: Sara Tendulkar: ఆంటీ అంటూ దారుణంగా ట్రోలింగ్‌.. క‌న్నీళ్లు పెట్టుకున్న సారా టెండూల్క‌ర్

స్టేడియం నుంచి దొంగ చాటున జారుకున్న మొహ్సిన్ నఖ్వీ

Advertisement

టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India vs Pakistan Match) మధ్య శివరాత్రి రోజు ప్రేమదాస స్టేడియం వేదికగా ( R.Premadasa Stadium, Colombo) కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఏకంగా 61 పరుగుల తేడాతో ఎవరు ఊహించని రీతిలో విక్టరీ నమోదు చేసుకుంది. వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఏమాత్రం గట్టి పోటీ ఇండియాకు ఇవ్వలేకపోయింది పాకిస్తాన్. ఈ దెబ్బకు వరుసగా మూడు విజయాలను ఈ టోర్నమెంట్లో నమోదు చేసుకుని టీమిండియా.

అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ త్వరగానే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇది చూసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ కంగు తిన్నాడు. మ్యాచ్ ఫినిష్ అయ్యేవరకు ఉంటే తన పరువు పోతుందని భావించాడు. వెంటనే తన సెక్యూరిటీ కి సమాచారం ఇచ్చి… ప్రేమ దాస స్టేడియం నుంచి మెల్లగా జారుకున్నాడు మొహ్సిన్ నఖ్వీ. టాయిలెట్ కు వెళ్తున్నానని చెప్పి, ప్రేమదాస స్టేడియం నుంచి బయటకు వెళ్లిపోయాడట మొహ్సిన్ నఖ్వీ. తన కారులో మొహ్సిన్ నఖ్వీ వెళ్లిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. దీంతో ఇండియన్ ఫాన్స్ దారుణంగా PCB మొహ్సిన్ నఖ్వీని ( PCB Mohsin Naqvi) ట్రోల్ చేస్తున్నారు. పరువు పోతుందని ముందే భావించి ఎస్కేప్ అయ్యాడ‌ని పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్.

మొహ్సిన్ నఖ్వీపై పాకిస్తాన్ మాజీలు విమర్శలు

Advertisement

ఇండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోయిన నేపథ్యంలో మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ దారుణమైన ఓటమికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ బాధ్యత వహించాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఫైర్ అవుతున్నారు. వాడి వల్లే పాకిస్తాన్ జట్టు ఇలా దరిద్రంగా తయారైందని మండిపడుతున్నారు. వెంటనే మొహ్సిన్ నఖ్వీని పదవి తొలగించాలని కోరుతున్నారు.

Also Read: IND VS PAK: శివ‌రాత్రి నాడే కాళరాత్రి మిగిల్చారు..పాకిస్తాన్ దారుణ ఓట‌మి, సూప‌ర్ 8లోకి టీమిండియా

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×