Hair Regrowth: ఈ రోజుల్లో ఏ వయస్సు వారికైనా జుట్టు రాలడం లేదా బట్టతల అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. చెడు జీవనశైలి, ఒత్తిడి, పోషకాహార లోపం, కాలుష్యం దీనికి ప్రధాన కారణాలు. కానీ మంచి విషయం ఏమిటంటే కొన్ని సులభమైన, హోం రెమెడీస్ పాటించడం వల్ల మనం ఊడిన చోట జుట్టు తిరిగి పెరిగేలా చేయవచ్చు. 8 సింపుల్ చిట్కాలను మీరు క్రమం తప్పకుండా పాటిస్తే.. మీ జుట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, ఊడిన చోట కొత్త జుట్టు కూడా పెరగడం ప్రారంభమవుతుంది. మీ జుట్టును తిరిగి పెంచే హోం రెమెడీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆవాలు, కొబ్బరి నూనెతో మసాజ్ :
వారానికి రెండుసార్లు మీ తలకు ఆవాలు, కొబ్బరి నూనెలతో మసాజ్ చేసుకోండి. ముఖ్యంగా ఆవాలు, కొబ్బరి నూనె మిశ్రమం జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది. అంతే కాకుండా తలపై రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది కొత్త జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఈ ఆయిల్‌లను 10-15 నిమిషాలు తలపై సున్నితంగా మసాజ్ చేసి.. కొన్ని గంటల తర్వాత తలస్నానం చేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఉసిరి, బ్రాహ్మి వాడకం:
ఉసిరి జుట్టుకు అమృతం లాంటిది. మీరు వీటిని ఆహారంలో భాగంగా చేర్చుకోవచ్చు. లేదా జుట్టుకు కూడా అప్లై చేసుకోవచ్చు. బ్రాహ్మి తలకు ఉపశమనం కలిగించి, జుట్టు మూలాలను బలపరుస్తుంది. అంతే కాకుండా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. మీరు దీని యొక్క పొడిని పెరుగులో కలిపి వారానికి ఒకసారి హెయిర్ మాస్క్ లా వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఊడిన చోట తిరిగి కొత్త జుట్టు వస్తుంది.
ఒత్తిడిని నియంత్రించండి:
ఒత్తిడి మీ జుట్టుకు అతిపెద్ద శత్రువు. యోగా, ధ్యానం లేదా ప్రతిరోజూ కాసేపు వాకింగ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇది హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి , జుట్టు రాలడాన్ని ఆపడానికి సహాయపడుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు, శరీరం కూడా బాగా పనిచేస్తుంది.
సమతుల్య , పోషకాహారం:
మొక్కకు పోషణ అవసరమైనట్లే.. జుట్టుకు కూడా పోషణ అవసరం. మీరు మీ ఆహారంలో ప్రోటీన్, ఐరన్, విటమిన్ బి12, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉండేలా చూసుకోండి. ఆకుపచ్చ కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, పప్పుధాన్యాలు , గుడ్లు జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి.
ఉల్లిపాయ రసం:
ఉల్లిపాయ రసాన్ని పురాతన కాలం నుండి జుట్టు పెరుగుదలకు ఉపయోగిస్తున్నారు. ఇందులో సల్ఫర్ ఉంటుంది. ఇది తలలో కొల్లాజెన్ ఏర్పడటాన్ని పెంచుతుంది. అంతే కాకుండా కొత్త జుట్టు పెరగడానికి కారణమవుతుంది. మీరు దీనిని వారానికి 1-2 సార్లు తలకు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.
Also Read: ప్రతి రోజు ఒక కప్పు పెరుగు తింటే.. ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే షాక్ అవుతారు
రసాయన ఉత్పత్తులకు దూరం:
షాంపూ, హెయిర్ కలర్ లేదా స్టైలింగ్ ఉత్పత్తులలో ఉండే కఠినమైన రసాయనాలు జుట్టును దెబ్బతీస్తాయి. అందుకే హెర్బల్ షాంపూలను మాత్రమే ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఇది జుట్టు మూలాలను రక్షిస్తుంది. అంతే కాకుండా జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
తగినంత నిద్ర, నీరు:
నిద్ర , నీరు ఈ రెండు విషయాలను చాలా మంది లైట్ తీసుకుంటారు. కానీ ఇవి చాలా ముఖ్యమైనవి. రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవడం, 2-3 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం నుండి వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా జుట్టు మూలాలు ఆరోగ్యంగా ఉంటాయి.