Dinesh Karthik On Indian fielders Dropped catches: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India, 2nd Test) మధ్య క్రైస్ట్ చర్చ్ ( Hagley Oval, Christchurch) వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో శుభమాన్ గిల్ సేన ఫీల్డింగ్ పై దినేష్ కార్తీక్ (Dinesh Karthik ) సీరియస్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఫీల్డింగ్ (dropped catches by Indian fielders) అత్యంత దారుణంగా ఉందని మండిపడ్డాడు. ఒక ఇన్నింగ్స్ లో 6 క్యాచ్ లు వదిలేస్తారా? అంటూ నిలదీశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు లడ్డూ లాంటి క్యాచ్ లను నేల పాలు చేసిందని ఫైర్ అయ్యాడు. టెస్ట్ క్రికెట్ ఆడే 12 దేశాలలో అత్యంత చెత్త క్యాచింగ్ రికార్డు కూడా టీమిండియాదేనని బాంబు పేల్చాడు.
ఇలాంటి చెత్త ఫీల్డర్స్ తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (ICC World Test Championship) గెలవలేమని దినేష్ కార్తీక్ (Dinesh Karthik ) కుండ బద్దలు కొట్టి చెప్పాడు. అలాంటి ఆశలు కూడా పెట్టుకోకూడదని సెటైర్లు పేల్చాడు. టీమిండియా ఫీల్డింగ్ పరిస్థితి ఇలాగే కొనసాగితే డబ్ల్యూటీసీ దరిదాపుల్లోకి కూడా టీమిండియా వెళ్లడం కష్టమేనని స్పష్టం చేశాడు. టీమిండియా కంటే కింది స్థాయి జట్లు కూడా మెరుగైన ఫీలింగ్ చేస్తూ మంచి ఫలితాలను సాధిస్తుందని వ్యాఖ్యానించాడు. టెస్ట్ క్రికెట్ లో ఫీల్డింగ్ సరిగ్గా ఉంటేనే, మ్యాచ్ లు గెలుస్తారని వెల్లడించాడు. అలా కాదని ప్రతి క్యాచ్ నేలపాలు చేస్తే టీమిండియా అట్టడుగునా పడిపోవడం గ్యారంటీ అని హెచ్చరించాడు.
న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ సందర్భంగా మొదటి ఇన్నింగ్స్ లోనే మొత్తం ఆరు క్యాచులను వదిలేశారు టీమిండియా ఫీల్టర్లు. ఆకాశ్ దీప్ బౌలింగ్ లో న్యూజిలాండ్ కెప్టెన్ లాథమ్ ఇచ్చిన అద్భుతమైన క్యాచ్ కేఎల్ రాహుల్ నేల పాలు చేశాడు. ఆ తర్వాత ఆకాశ్ దీప్ బౌలింగ్ లో పడిక్కల్ ఏకంగా రెండు క్యాచ్ లను వదిలేశాడు. బుమ్రా బౌలింగ్ లో డారిల్ మిచెల్ ఇచ్చిన అద్భుతమైన క్యాచ్ ను వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా వదిలేశాడు. అటు గుర్నూర్ బ్రార్ పాటు జైస్వాల్ కూడా తలో రెండు క్యాచులు వదిలేసి టీమిండియా కొంపముంచారు. ఆరు క్యాచులు నేలపాలు అయిన నేపథ్యంలో కెప్టెన్ గిల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
🚨 Dinesh Karthik went furious over the dropped catches by Indian fielders.
India have dropped a lot of catches, and among the 12 Test-playing nations, India have the worst catching record. We are hampering our ambitions of winning the WTC, and that will be impossible if this… pic.twitter.com/xHbqDqXHGI
— Indian Cricket Ministry (@Tejashyyyyyy) November 28, 2026