Peddi Shooting update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా పెద్ది. భారీ బడ్జెట్ తో పెద్ది సినిమా ను సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఉప్పెన తో భారీ సక్సెస్ ని అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు సాన ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండడంతో మూవీపై అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్నపెద్ది మూవీ పై అభిమానుల లో భారీ అంచనాలే నెలకొన్నాయి.తాజాగా ఈ మూవీ నుండి అప్డేట్ ను రామ్ చరణ్ తెలపడం తో మూవీ పై అంచనాలుపెరిగాయి.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బుచ్చిబాబు అంటే మాములుగా ఉండదు మరి..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లిమ్స్ వీడియో కు అభిమానుల నుండి మంచి స్పందన లభించింది. రామ్ చరణ్ రఫ్ లుక్ లో మాస్ హీరోగా,అదిరిపోయాడు అని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల రామ్ చరణ్ ప్రఖ్యాత మేడం టూసాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే, అక్కడ ఫ్యాన్స్ తో మీట్ అయిన సందర్భంలో రామ్ చరణ్ పెద్ది మూవీ గురించి లేటెస్ట్ అప్డేట్ ను ఫాన్స్ తో పంచుకున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ 30% పూర్తయినట్లు రామ్ చరణ్ తెలిపారు. ఈ మూవీ రంగస్థలం సినిమా ను మించి ఉంటుందని ఆయన ఫ్యాన్స్ మీట్ లో తెలిపారు. పెద్ది షూటింగ్ వేగంగా కంప్లీట్ అవుతుందని తెలుసుకున్న ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ ఖుషి లో ఉన్నారు. రంగస్థలం మించి ఉంటుందని తెలియడంతో మూవీ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
తొలి భారతీయ హీరో గా రికార్డు ..
ఇక రామ్ చరణ్ ఇటీవల మేడం టూసాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహావిష్కరణ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులంతా పాల్గొనడం జరిగింది. మెగా స్టార్ చిరంజీవి, సురేఖ, ఉపాసన, ఈ కార్యక్రం లో పాల్గొన్నారు. కొన్ని రోజుల క్రితం మ్యూజియం నిర్వాహకులు స్వయంగా హైదరాబాద్ వచ్చి చరణ్ విగ్రహం కోసం ఆయన కొలతలు తీసుకొని వెళ్లడం తెలిసిందే, ఇప్పుడు ఆయన మైనపు విగ్రహం, అతడి పెంపుడు కుక్క రైమ్ తో కలిపి చేయడం అభిమానులను ఆకట్టుకుంది. పైగా లండన్ లో మేడం టూ స్పాట్స్ లో ఏర్పాటు చేసిన తొలి భారతీయ హీరో విగ్రహం కావడం కూడా విశేషం. ఈ ఘనతను సాధించిన చరణ్ కు ఆయన ఫ్యామిలీతో పాటు అభిమానులు విషెస్ తెలిపారు.
Amzon Prime Video : సడన్ షాక్ ఇచ్చిన ప్రైమ్ వీడియో… డబ్బులు పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ఇక దండగ