Preity Zinta: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) పంజాబ్ టీం ( Punjab Kings) అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి టోర్నమెంట్లో ప్లే ఆఫ్స్ కు కూడా చేరింది పంజాబ్ కింగ్స్. దాదాపు 11 సంవత్సరాల తర్వాత… ప్లే ఆప్ కు వెళ్లి పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. అయితే అలాంటి పంజాబ్ కింగ్స్ జట్టులో ఇప్పుడు పెనుప్రకంపలను చోటు చేసుకున్నాయి. తాజాగా పంజాబ్ కింగ్స్ సహా యజమానుల పైన… కేసు వేశారు బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా ( Preity Zinta ).
Also Read: LSG VS GT: దిగ్వేశ్ పోయాడు.. లక్నోలో మరొకడు తగిలాడు..నోట్ బుక్ సిగ్నచర్ సెలెబ్రేషన్స్ చేస్తూ
కోర్టు మెట్లు ఎక్కిన ప్రీతి జింటా ( Preity Zinta )
పంజాబ్ కింగ్స్ జట్టు యజమానులుగా మోహిత్ బర్మన్, నెస్ వాడియా లాంటి వారు ఉన్నారు. అందులో కో ఓనర్ గా ప్రీతి జింటా ఉన్న సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్ హీరోయిన్ గా ప్రీతి జింటా కొనసాగిన నేపథ్యంలో… ఆమెనే ముందుండి పంజాబ్ కింగ్స్ నడిపిస్తున్నారు. హగ్స్ ఇవ్వడం, ఫ్లయింగ్ కిస్ లు ఇవ్వడం… లాంటివి చేసి పంజాబ్ టీం కు హైప్ తెప్పించారు ప్రీతి జింటా. అయితే అలాంటి ప్రీతి జింటాకు తెలియకుండా… పంజాబ్ కింగ్స్ సహా యజమానులు అందరూ కలిసి ఒక సమావేశం నిర్వహించారట.
సొంతవల్లే మోసం
ప్రీతి జింటాకు వ్యతిరేకంగా ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గ్రహించిన బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా… ఆరా తీశారని సమాచారం. అయినప్పటికీ పంజాబ్ కింగ్ సహా ఓనర్లు ఎలాంటి సమాధానం ఇవ్వలేదట. దీంతో చేసేదేమీ లేక ఆమె చండీగఢ్ కోర్టులో చట్టపరమైన కేసు దాఖలు చేశారు. తమ జట్టులో… తనకు వ్యతిరేకంగా సమావేశాలు జరుగుతున్నాయని.. దీనిపై కోర్టు తేల్చాలని ఆమె పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీంతో ఈ పంచాయతీ రోడ్డుకి ఎక్కింది. మరి ఈ కోర్టు కేసు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read: IPL players :పంజాబ్ దరిద్రాన్ని ఢిల్లీకి పట్టించారా.. ఈ 4 గురు ప్లేయర్లు అడుగుపెడితే సర్వనాశనమేనా..?
ఇది ఇలా ఉండగా… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) …. పంజాబ్ కింగ్స్ రాత పూర్తిగా మారిపోయింది. ఎన్నడూ లేని విధంగా పంజాబ్ టీమ్స్ జట్టు అదరగొడుతోంది. ఏమాత్రం వణుకు లేకుండా ముందుకు వెళ్తోంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ దూసుకు వెళ్తుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్లే ఆఫ్స్ కు కూడా పంజాబ్ కింగ్స్ వెళ్ళింది. ఇక ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడింది. ఇందులో ఎనిమిది మ్యాచ్ల్లో విజయం సాధించి దుమ్ములేపింది పంజాబ్ కింగ్స్. మూడు మ్యాచ్ల్లో ఓడిపోయింది. దీంతో 17 పాయింట్లు సాధించిన పంజాబ్ కింగ్స్.. ప్లే ఆఫ్ స్థానాన్ని ఖరారు చేస్తుంది.