Probable SRH retained players for IPL Mega Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కోసం కసరతులు కొనసాగుతున్నాయి. ఈ డిసెంబర్ లేదా నవంబర్ మాసంలో మెగా వేలం కూడా జరగనుంది. దీనికోసం ఇప్పటికే రిటెన్షన్… మార్గదర్శకాలను ఖరారు చేశారు. అలాగే టీం పర్సు వేల్యూ 120 కోట్లకు పెంచారు. ఆరుగురు ప్లేయర్లను నేరుగా రిటన్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది.
Also Read: Hong Kong Sixes: 5 ఓవర్ల టోర్నీ ఆడనున్న టీమిండియా.. ఈ టోర్నమెంట్ రూల్స్ ఇవే!
ముఖ్యంగా ఆర్టిఎం కార్డును…. ఈసారి వాడుకునేలా ప్లాన్ చేశారు. అలాగే అక్టోబర్ చివరి వరకు… రిటెన్షన్ జాబితాను.. ఇవ్వాలని 10 ఫ్రాంచైజీ ఓనర్లకు బిసిసిఐ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ మేరకు… అన్ని జట్లు తమ రిటెన్షన్ జాబితాను రెడీ చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే హైదరాబాద్ ఓనర్ కావ్య మారాన్ కూడా దీనిపై ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఈసారి… దక్షిణాఫ్రికా ప్లేయర్ మార్కరం ను రి టెన్షన్ లో తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నారట.
Also Read: Jp Duminy: JP డుమిని దొంగాట..కోచ్ గా ఉండి..ఫీల్డింగ్ చేశాడు..?
కానీ… కెప్టెన్ ఫ్యాట్ కమ్మిన్స్ , హెన్రిచ్ క్లాసెఎన్, హెడ్, నితీష్ కుమార్ రెడ్డి అలాగే అభిషేక్ శర్మాను… తీసుకోవాలని కావ్య నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కమిన్స్ ను 18 కోట్లకు, క్లాసెన్ ను 14 కోట్లు, అభిషేక్ శర్మకు 11 కోట్లు ఇచ్చి రిటెన్షన్ చేసుకోనున్నారట. నితీష్ కుమార్ రెడ్డి అలాగే హెడ్ ను ఆర్టిఎం కింద తీసుకోవాలని అనుకుంటున్నారు. దీనిపై అతి త్వరలోనే… అధికారిక ప్రకటన రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ట్రావిస్ హెడ్… IPL 2024 సమయంలో SRH బ్యాటింగ్ లైనప్‌కు మూలస్తంభంగా నిలిచాడు. ట్రావిస్ హెడ్ ను INR 6.80 కోట్లకు కొనుగోలు చేశారు కావ్యా పాప. ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియన్ ఎడమ చేతి వాటం ఆటగాడు అన్న సంగతి తెలిసిందే. గత ఐపీఎల్ సీజన్ లో15 మ్యాచ్‌లకు పైగా ఆడిన ట్రావిస్ హెడ్… 191.55 స్ట్రైక్ రేట్‌తో అద్భుతమైన 567 పరుగులు చేశాడు.
స్కోరింగ్‌ను వేగవంతం చేయడంలో, ఒత్తిడిని జయించి సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)పై కేవలం 41 బంతుల్లో 102 పరుగులు, లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మరియు ఢిల్లీ క్యాపిటల్స్ (DC)పై రెండు బ్యాక్-టు-బ్యాక్ 89లు వంటి అద్భుతమైన ఇన్నింగ్స్‌లు హెడ్ ఆడాడు. అందుకే హెడ్ ను ఈ సారి కెప్టెన్ చేయాలని కావ్యా అనుకుంటున్నారట.