E-Paper
Advertisement

PSL 2026: “నో ట్రావెల్ జోన్” గా ప్ర‌క‌ట‌న‌..పాకిస్తాన్ వెళ్లొద్ద‌ని ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ల‌కు ఆదేశాలు !

PSL 2026: “నో ట్రావెల్ జోన్” గా ప్ర‌క‌ట‌న‌..పాకిస్తాన్ వెళ్లొద్ద‌ని ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ల‌కు ఆదేశాలు !
Advertisement

PSL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కంటే ముందుగానే పాకిస్తాన్ నిర్వహిస్తున్న PSL 2026 లీగ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ కంటే రెండు రోజులు ముందుగానే మార్చి 26వ తేదీ నుంచి పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభం అవుతుంది. మార్చి 26వ తేదీ నుంచి మే మూడో తేదీ వరకు ఈ టోర్నమెంట్ కొనసాగుతుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ లో పాకిస్తాన్ వైమానిక దాడి చేసిన ఎఫెక్ట్, పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ పైన పడింది. ఈ టోర్నమెంట్ ఆడేందుకు వస్తున్న ఆస్ట్రేలియా ప్లేయర్లకు అక్కడి క్రికెట్ బోర్డు కీలక ఆదేశాలు చేసింది. పాకిస్తాన్ లో పర్యటించకూడదని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Also Read: Virender Sehwag: నేనైతే పాకిస్తాన్ బౌల‌ర్ల కెరీర్ నాశ‌నం చేసేవాడిని..300 స్ట్రైక్ రేట్ తో న‌ర‌కం చూపిస్తా

నో ట్రావెల్ జోన్ గా పాకిస్తాన్.. ఆస్ట్రేలియా క్రికెటర్ల రాకపై సందిగ్ధం

Advertisement

కాబూల్ సంఘటన నేపథ్యంలో పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య ఏ క్షణమైన యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాడికి ప్రతి దాడి కచ్చితంగా ఉంటుందని ఇప్పటికే ఆఫ్గనిస్తాన్ వార్నింగ్ ఇచ్చింది. అంటే ఏ క్షణమైనా కాబుల్ ఘటనకు ప్రతీకారంగా పాకిస్తాన్ పైన రివెంజ్ తీర్చుకునేందుకు కాపు కాసుకొని కూర్చుంది ఆఫ్గనిస్తాన్. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఆడేందుకు వెళ్లడం రిస్క్ తో కూడుకున్న పని అని ఆస్ట్రేలియా క్రికెటర్లకు వాళ్ల సొంత‌ క్రికెట్ బోర్డు ( Cricket Australia) హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్ పర్యటించకూడదని వెల్లడించింది.

ఇక ముందుగా ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టి.. వెళ్తే వెళ్లండి అని ఓ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్. అందులోనూ కొన్ని కండిషన్స్ పెట్టింది. పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాలలో జరిగే మ్యాచ్ లకు దూరంగా ఉండాలని ఆస్ట్రేలియా క్రికెట్లకు సూచనలు చేసింది. ఇప్పటికే ఈ సరిహద్దు ప్రాంతాలను నో ట్రావెల్ జోన్ గా ప్రకటించారు. పెషావర్, కేటా అలాంటి ప్రాంతాలలో అస్సలు పర్యటించకూడదని ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఆదేశాలు జారీ చేసింది అక్కడి క్రికెట్ బోర్డు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలలో మ్యాచులు జరిగితే ఆడకూడదని పేర్కొంది. క్రికెట్ ఆస్ట్రేలియా ఆదేశాల మేరకు మాక్సిమామ, మార్నస్ లాబుస్‌చగ్నే, స్టీవెన్ స్మిత్ లాంటి ప్లేయర్లు పాకిస్తాన్ లో పర్యటిస్తున్నారు.

విదేశీ ప్లేయర్ల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు

Advertisement

మిడిల్ ఈస్ట్, పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ విజయవంతంగా నడిపించేందుకు PCB బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఏదైనా జరగరానిది జరిగితే విదేశీ ప్లేయర్లను వాళ్ల ఇంటికి పంపించేందుకు ప్రత్యేకంగా విమానాలను కూడా ఏర్పాటుచేసింది. ఎలాంటి భయాందోళన లేకుండా పాకిస్తాన్ సూపర్ టోర్నమెంట్ ఆడుకోవచ్చని విదేశీ ప్లేయర్లకు సూచనలు చేస్తోంది PCB.

Also Read: Pakistan-no ball: పాకిస్తాన్ జ‌ట్టులో ఫిక్సింగ్ క‌ల‌క‌లం…క్రీజుకు అర మీట‌ర్ దూరంగా నో బాల్, అమీర్ పై ట్రోల్స్‌

 

 

–Z7diIC4/?igsh=dDltOTZtbWVvaTI4

 

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×