Romantic Drama OTT: ఓటీటీలో రొమాంటిక్ సినిమాలకి కొదవలేదు. ఎక్కువగా ఈ కంటెంట్ సినిమాలు వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒక నకిలీ పెళ్లి చేసుకునే జంట చుట్టూ ఈ కథ ఉంటుంది. క్లైమాక్స్ వరకు ఈ సినిమా ఆసక్తిగా నడుస్తుంది. ఈ సినిమా ఓటీటీలోకి వచ్చాక టాప్ ట్రెండింగ్ లో నడిచింది కూడా. ప్రేమికులకు మంచి ఫీలింగ్ ఇచ్చే సినిమా ఇది.
ఈ అమెరికన్ రొమాంటిక్ డ్రామా సినిమా పేరు ‘పర్పుల్ హార్ట్స్’ (Purple Hearts). ఈ చిత్రాన్ని ఎలిజబెత్ అలెన్ రోసెన్‌బామ్ దర్శకత్వం వహించారు. ఇందులో సోఫియా కార్సన్, నికోలస్ గాలిట్జైన్ ప్రధాన పాత్రలు పోషించారు. సోఫియా కార్సన్ ఈ సినిమాకు కథానాయికగానే కాకుండా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించారు. ఇది విడుదలైన మొదటి వారంలోనే నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకుంది. 2022 సంవత్సరంలో నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన సినిమాల్లో ఇది 3వ స్థానంలో నిలిచింది. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, అప్పట్లో భారీ బడ్జెట్ సినిమా అయిన ‘ది గ్రే మ్యాన్’ రికార్డులను కూడా అధిగమించింది. ఇది ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది.
క్యాసీ అనే అమ్మాయికి సింగర్ అవ్వాలని పెద్ద ఆశ, కానీ చేతిలో పైసా లేదు సరికదా.. ఆమెకు షుగర్ వ్యాధి ఉండి మందులకి కూడా తిప్పలవుతుంటాయి. అప్పుడే అమెరికా మిలిటరీలో పనిచేసే ల్యూక్ అనే కుర్రాడు పరిచయం అవుతాడు ఆమెకు. అతనికి కూడా పాత అప్పులు తీర్చడానికి అర్జంటుగా డబ్బులు కావాల్సి వస్తుంది. చిన్న పాటి గొడవలతో పరిచయం అయిన వీళ్లిద్దరూ ఒక ప్లాన్ వేస్తారు. మిలిటరీ వాళ్లు పెళ్లి చేసుకున్న సోల్జర్లకి ఇచ్చే ఇన్సూరెన్స్, ఎక్స్ట్రా డబ్బుల కోసం.. వీళ్లిద్దరూ ఇష్టం లేకపోయినా నకిలీ పెళ్లి చేసుకుని అందరినీ నమ్మిస్తారు.
కానీ సీన్ కట్ చేస్తే, ల్యూక్ యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన బాంబు దాడిలో అతని కాళ్లు దెబ్బతింటాయి. దీంతో ఇంటికి తిరిగి వస్తాడు ల్యూక్. బయట ప్రపంచానికి వీళ్లు నిజమైన భార్యాభర్తల్లాగే నటించాల్సి రావడంతో, క్యాసీ వాడికి సపర్యలు చేస్తూ ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. మొదట్లో ఒకరినొకరు చూస్తేనే మండిపడే వీళ్లు, గొడవలు పడుతూనే నెమ్మదిగా ఒకరి కష్టాల్ని ఒకరు అర్థం చేసుకోవడం మొదలుపెడతారు. చివరికి ఆ నకిలీ పెళ్లి కాస్తా నిజమైన ప్రేమగా మారుతుంది. అయితే వీళ్లు చేసిన మోసం మిలిటరీ కోర్టుకి తెలిసిపోతుంది. ల్యూక్ ఆ తప్పునంతా తన మీద వేసుకుని జైలుకి వెళ్తాడు. వాడు తిరిగి వచ్చాక క్యాసీ వాడి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అలా గొడవలతో మొదలైన వీళ్ళ బంధం, ప్రాణం ఇచ్చే ప్రేమతో సుఖాంతం అవుతుంది.
Read Also : కాబోయే మొగుడు ఇంకో పిల్లతో… లోకం చూపించే కొత్త ప్రియుడు… కన్నీళ్ళు పెట్టించే క్లైమాక్స్