IPL 2025: ఇండియన్ ప్రీయర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) అతి త్వరలోనే ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దీంతో ఇండియన్ ప్రీయర్ లీగ్ 2025 టోర్నమెంట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. మార్చి 21 వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీయర్ లీగ్ 2025 టోర్నమెంట్… మే 25 వరకు జరుగనుంది. మే 25న ఇండియన్ ప్రీయర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. అది కూడా ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది.
Also Read: Marcus Stoinis Retirement: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. మార్కస్ స్టోయినిస్ రిటైర్మెంట్!
అయితే.. ఇలాంటి నేపథ్యంలోనే… పంజాబ్ కింగ్స్ ( Punjab Kings ) గురించే అందరూ చర్చించుకుంటున్నారు. గత 15 ఏళ్లుగా ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న పంజాబ్ కింగ్స్ వచ్చే సీజన్లో ఆ జట్టు కల నెరవేరేలా కనిపిస్తోంది. ఈసారి పంజాబ్ జట్టు బలమైన జట్టును బరిలోకి దింపబోతోంది. మెగా వేలంలో ఆచితూచి మ్యాచ్ విన్నర్లను కొనుగోలు చేసిన ప్రీతి జింటా ఇప్పుడు జట్టును ఛాంపియన్ చేసేందుకు సరికొత్త ప్రణాళికలను రచిస్తోంది. IPL 2025 మెగా వేలానికి ముందు రికీ పాంటింగ్ ను ప్రధాన కోచ్ గా నియామకం చేయడం జరిగింది పంజాబ్ కింగ్స్. ఆస్ట్రేలియాకు రెండు వన్డే ప్రపంచ కప్ లను అందించిన రికీ పాంటింగ్ ( Ricky Ponting ) లాంటి కోచ్ ఉండడం పంజాబ్ కు అదనపు బలంగా మారిందని చెప్పవచ్చు.
ఢిల్లీ క్యాపిటల్స్ ఆ జట్టు ఏడు సంవత్సరాల అనంతరం 2019లో మొదటిసారి ప్లేఆఫ్స్ కు అర్హత సాధించింది. అది కేవలం పాంటింగ్ ( Ricky Ponting ) తోనే సాధ్యమైంది. మెగా వేలంలో శ్రేయస్ అయ్యర్ ను కొనుగోలు చేసి ఫ్రాంచైజీ జట్టును పటిష్టం చేసింది. అంతేకాదు వచ్చే సీజన్లో పంజాబ్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ను ఎంపిక చేసేందుకు చేసేందుకు సిద్ధంగా ఉంది పంజాబ్ యాజమాన్యం. శ్రేయస్ అయ్యర్ ( Shreyas Iyer ), రికీ పాంటింగ్ ( Ricky Ponting ) కలిస్తే పంజాబ్ కింగ్స్ జట్టుకు తిరుగు ఉండదు. వీరిద్దరితో పాటు ఏ ఓవర్ లోనైనా మ్యాచును మలుపు తిప్పగల ముగ్గురు స్టార్స్ ఆల్ రౌండర్లను కొనుగోలు చేసింది పంజాబ్ యాజమాన్యం.
Also Read: Sunrisers Hyderabad: కావ్యాపాప భారీ డీలింగ్.. ఈ సారి ఏకంగా రూ.1092 కోట్లు !
మార్కో జాన్సన్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్ తర్వాతి సీజన్లో పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని అంచనా వేయచ్చు. గత సీజన్లో లక్నో సూపర్ జేయింట్స్ తరపున కీలక పాత్ర పోషించాడు స్టోయినిస్. సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఫైనల్స్ కు తీసుకు వెళ్లడంలో కీలక పాత్ర చడం జరిగింది మార్కో జాన్సన్. అయితే గత సీజన్లో మ్యాక్స్వెల్ ఆర్సిబి తరపున విఫలం అయ్యాడు. . కానీ మ్యాక్స్వెల్ ప్రతిభను ఏ మాత్రం తక్కువ అంచనా వేయకూడదని చెప్పవచ్చును. మ్యాక్స్వెల్ ను తక్కువ అంచనా వేసి ప్రమాదంలో పడేందుకు ఏ జట్టు కూడా సిద్ధంగా ఉండదని అనుకోవచ్చు.. అందువల్ల వచ్చే సీజన్ లో మ్యాక్స్వెల్ కచ్చితంగా పంజాబ్ కు ఖరీదైన ప్లేయర్ గా మారతాడు అని చెప్పవచ్చు.. మరి ఈ సారి పంజాబ్ ఎలా ముందుకు వెళుతుందో చూడాలి.