LSG VS PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament) భాగంగా.. ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ( Lucknow Super Giants vs Punjab Kings ) మధ్య 13 మ్యాచ్ జరగనుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బీహార్ వాజ్పేయి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ( Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium, Lucknow ) ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు… పూర్తయ్యాయి. ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో.. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్… మొదట బౌలింగ్ చేయనుంది. దింతో లక్నో బ్యాటింగ్ చేయనుంది.
Also Read: Kohli On World Cup 2027: 2027 వరల్డ్ కప్ లో ఆడటంపై కోహ్లీ సంచలన ప్రకటన..రిటైర్మెంట్ అప్పుడే ?
మ్యాచ్ టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament) భాగంగా ఇవాళ జరిగే లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ( Lucknow Super Giants vs Punjab Kings ) మ్యాచ్… సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఈ కీలక మ్యాచ్… జియో హాట్ స్టార్ లో ఉచితంగా చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా ఈ మ్యాచ్ వస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచ్ లు అన్ని.. ఉచితంగానే అందిస్తోంది రిలయన్స్ జియో.
లక్నో వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య రికార్డులు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటు నేపథ్యంలో లక్నో వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య రికార్డులు ఒకసారి పరిశీలిస్తే… ఇందులో రిషబ్ పంత్ టీం పై చేయి సాధించింది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య నాలుగు మ్యాచ్లు మాత్రమే జరిగాయి. ఇందులో లక్నో సూపర్ ఏకంగా మూడు మ్యాచ్ లలో విజయం సాధించింది. అలాగే.. పంజాబ్ టీమ్స్ కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే విజయం సాధించింది. అంటే దాదాపు 90% విన్నింగ్ ఛాన్సులు లక్నో సూపర్ జెంట్స్ కు మాత్రమే ఉన్నాయి. ఇవాల్టి మ్యాచ్ లక్నోకు హోమ్ గ్రౌండ్ కావడం కూడా వాళ్లకు ప్లస్ కానుంది.
Also Read: John Cena: కాన్సర్ బారిన పడ్డ WWE సూపర్ స్టార్ జాన్ సీనా !
లక్నో సూపర్ జెయింట్స్ VS పంజాబ్ కింగ్స్ తుది జట్లు
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, దిగ్వేష్ సింగ్ రాఠీ, శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(w), శ్రేయాస్ అయ్యర్(c), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, సూర్యాంశ్ షెడ్జ్, మార్కో జాన్సెన్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్