Bangkok Pilla:..రెండు దేశాలను భారీ భూకంపం తీవ్రంగా కుదిపేసిన విషయం తెలిసిందే.. రిక్టర్ స్కేల్ పై ఏకంగా 7.7, 6.8 తీవ్రతతో రెండుసార్లు నమోదు అయిన ప్రకంపనలకు మయన్మార్, దాని పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ రెండూ కూడా వణికిపోయాయి. ముఖ్యంగా భారీగా వచ్చిన ఈ భూకంప ప్రకంపనలకు భారీ భవనాలు సైతం కుప్పకూలాయి. దీంతో బ్యాంకాక్ లో పరిస్థితి చాలా భయానకంగా మారింది. ఎటు చూసినా సరే కూలిన భవనాలు, శిథిలాలే కనిపిస్తున్నాయి. అక్కడి ప్రజల పరిస్థితులు చూస్తే నిజంగా అగమ్య గోచరంగా మారిపోయింది. ఇప్పటివరకు దాదాపు చాలామందికి పైగా మృతి చెందారని సమాచారం. మరికొంతమంది శిథిలాల కిందే తల దాచుకొని ప్రాణాలు కాపాడుకున్న యువతులు కూడా ఉన్నారు. ఇకపోతే మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అటు బ్యాంకాక్ లో ఒక ఆసుపత్రిని కూడా ఖాళీ చేయించారు.
భూకంపం దాడిలో చిక్కుకుపోయిన బ్యాంకాక్ పిల్ల..
ప్రజలు ఈ భూకంప ప్రకంపనల నుంచి తమను తాము కాపాడుకోవడానికి రోడ్లపై పరుగులు పెడుతున్నారు. ఇకపోతే బ్యాంకాక్ ,మయన్మార్, థాయిలాండ్ దేశాలలో ఉన్న భారతీయులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వారిలో ప్రముఖ యూట్యూబర్ బ్యాంకాక్ పిల్ల గా గుర్తింపు తెచ్చుకున్న శ్రావణి కూడా అక్కడే ఉంది. బ్యాంకాక్ పిల్ల అసలు పేరు శ్రావణి వర్మ సామంతపూడి.ఈమె బ్యాంకాక్ పిల్లగా తెలుగు వారికి బాగా దగ్గరైంది.భర్త ఉద్యోగంలో భాగంగా బ్యాంకాక్ వెళ్లి అక్కడే స్థిరపడిన ఈమె.. యూట్యూబ్ ద్వారా అక్కడి సంగతులను మన ఇండియన్స్ కి తెలియజేస్తూ ఉంటుంది. ఇకపోతే తాజాగా భూకంపం దాటికి వారు ఎంత భయపడ్డారు.. అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి.. ముఖ్యంగా భూకంపం తర్వాత తమ అపార్ట్మెంట్ ఏ స్థితిలో ఉంది. అందులో ఉండే వస్తువుల పరిస్థితి ఏంటి అంటూ ప్రతి ఒక్కటి చూపించింది.
భూకంపం తర్వాత తన అపార్ట్మెంట్ ఎలా అయిందంటే..?
బ్యాంకాక్ పిల్ల కుటుంబం ఉంటున్న అపార్ట్మెంట్లో నిత్యం పూజలు జరుగుతాయని, ఆ దేవుడి దయ వల్లే అపార్ట్మెంట్ కుప్పకూల కుండా ఎక్కడికక్కడ క్రాక్స్ వచ్చేసాయని తెలిపింది.. అయితే ఈ భూకంపం జరిగే సమయంలో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నామని, ముఖ్యంగా తన కుమారుడు స్కూల్ 24వ ఫ్లోర్లో ఉండగా.. అతడు క్షేమంగా బయటకి వచ్చేవరకు తన పైప్రాణాలు పైనే పోయాయంటూ చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం తన అపార్ట్మెంట్ కి చేరుకున్న బ్యాంకాక్ పిల్ల తన భర్తతో కలిసి కొన్ని అవసరమైన వస్తువులను తిరిగి ప్రస్తుతం ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్లడానికి వచ్చి అక్కడ అపార్ట్మెంట్లో ఉన్న పరిస్థితులను కూడా తన అభిమానులతో చూపించే ప్రయత్నం చేసింది. అంత భూకంపంలో కూడా ఆమె భయపడకుండా వీడియోలు తీసి అక్కడ పరిస్థితులను ఇక్కడి వారికి తెలియజేయడం పై ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపోతే ఈమెకు 20 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. గతంలో కూడా బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొంటుందని ప్రచారం కూడా జోరుగా సాగింది. ఇక ప్రస్తుతం బ్యాంకాక్ పిల్ల భూకంపం తర్వాత తన అపార్ట్మెంట్ పరిస్థితిని చూపించి అందరిని ఆశ్చర్యపరిచింది.