E-Paper
Advertisement

IPL 2024 Purple Cap Winner: 2024 ఐపీఎల్ పర్పుల్ క్యాప్ విజేత.. పంజాబ్ కింగ్ హర్షల్ పటేల్!

IPL 2024 Purple Cap Winner: 2024 ఐపీఎల్ పర్పుల్ క్యాప్ విజేత.. పంజాబ్ కింగ్ హర్షల్ పటేల్!

Harshal Patel Wins Purple Cap with 24 Wickets in IPL 2024 Season: ఐపీఎల్ 2024 సమరం ముగిసింది. కోల్ కతా నైట్ రైడర్స్ విజేతగా నిలిచింది. హైదరాబాద్ రన్నరప్ గా మిగిలిపోయింది. విజేతలు తేలిపోయిన తర్వాత వాళ్లు ఎలా ఆడారు..? వీళ్లు ఎలా ఆడారు..? టాపర్స్ ఎవరు..? వీటిపై అందరి ఫోకస్ పడుతుంది. అందుకని ఫైనల్ మ్యాచ్ కూడా అయిపోయింది కాబట్టి, బౌలర్లలో పర్పుల్ క్యాప్ ని అందుకునేది ఎవరో తేలిపోయింది. తను మరెవరో కాదు.. లీగ్ దశలోనే కథ ముగిసిపోయిన పంజాబ్ కింగ్స్ ఆటగాడు హర్షల్ పటేల్.

ఏమిటి..? పంజాబ్ కింగ్స్ 14 మ్యాచ్ లు ఆడి 5 మాత్రమే గెలిచింది కదా.. మరి హర్షల్ పటేల్ ఎలా నెంబర్ వన్ అయ్యాడని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ గెలవడం, ఓడటం కాదు సమస్య.. ఎన్ని వికెట్లు తీశామన్నదే ముఖ్యం. అలా చూస్తే హర్షల్ పటేల్ అందరికన్నా ఎక్కువగా 24 వికెట్లు తీసి నెంబర్ వన్ బౌలర్ గా నిలిచాడు.

మీడియం పేసర్ గా ఉన్న హర్షల్ పటేల్ 2024 ఐపీఎల్ సీజన్ లో పర్పుల్ క్యాప్ నకు అర్హత సాధించాడు. 14 మ్యాచ్ ల్లో 49 ఓవర్స్ వేశాడు. 24 వికెట్లు తీశాడు. ఎకానమీ 9.73గా ఉంది. ఇక తన తర్వాత నుంచి వరుసగా చూస్తే..

Also Read: ఆరెంజ్ క్యాప్ విజేత.. విరాట్ కొహ్లీ

2. కోల్ కతా నుంచి వరుణ్ చక్రవర్తి (21)
3. ముంబాయి నుంచి జస్ప్రీత్ బుమ్రా (20)
4.హైదరాబాద్ నుంచి టి. నటరాజన్ (19)
5.కోల్ కతా నుంచి హర్షిత్ రాణా (19)
6.రాజస్థాన్ నుంచి ఆవేశ్ ఖాన్ (19)
7.పంజాబ్ కింగ్స్ నుంచి అర్షదీప్ సింగ్ (19)
8.కోల్ కతా నుంచి ఆండ్రి రసెల్ (19)
9.హైదరాబాద్ నుంచి పాట్ కమిన్స్ (18)
10. రాజస్థాన్ నుంచి యజ్వేంద్ర చాహల్ (18)

వీరందరూ ఐపీఎల్ 2024 సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో ఉన్నారు. వీరిలో కోల్ కతా నుంచి ముగ్గురు, హైదరాబాద్ నుంచి ఇద్దరు, పంజాబ్ కింగ్స్ నుంచి ఇద్దరు, రాజస్థాన్ నుంచి ఇద్దరు, ముంబాయి నుంచి ఒకరు బౌలింగులో టాపర్లుగా ఉన్నారు.

ఐపీఎల్ 2024 సీజన్ లో 10 జట్లు పాల్గొంటే.. 5 జట్ల బౌలర్లు మాత్రమే టాప్ టెన్ లో ఉన్నారు. మిగిలిన 5 జట్ల నుంచి ఒక్కరు కూడా లేకపోవడం విశేషం. ఈసారి వచ్చే ఎన్నికల్లో ఈ ఐదు జట్లు కూడా టాప్ బౌలర్లపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే కోల్ కతా నుంచి ముగ్గురు టాప్ 10లో ఉండటం వల్లే ఐపీఎల్ ట్రోఫీ సాధించిందని.. చిన్నపిల్లలకి కూడా అర్థమైపోతోంది.. నిజమే కదా..

Related News

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

Big Stories

×