BigTV English

Shikhar Dhawan Injury: పంజాబ్ కి షాక్.. ధావన్ రెండు వారాలు ఆడట్లేదు!

Shikhar Dhawan Injury: పంజాబ్ కి షాక్.. ధావన్ రెండు వారాలు ఆడట్లేదు!
Dhawan Suffers Shoulder Injury Out For ‘At Least Seven’ Days: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ రెండు వారాలు ఐపీఎల్ మ్యాచ్ లకు దూరం కానున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ధావన్ ఆడలేదు. దాంతో ఏం జరిగింది? ఏం జరిగింది? అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. నెట్టిల్లు అంతా జల్లెడ పట్టేశారు. అయితే తన ప్లేస్ లో శ్యామ్ కర్రన్ కెప్టెన్ గా జట్టుని ముందుండి నడిపించాడు. అయితే మ్యాచ్..‘ లో స్కోరు’ గేమ్ కావడంతో కాపాడుకోలేక పోయారు.

మొత్తానికి ధావన్ ఎందుకు ఆడటం లేదో వివరం తెలిసింది. పంజాబ్ జట్టు క్రికెట్ డవలప్ మెంట్ హెడ్ సంజయ్ బాంగర్ ఒక ప్రకటనలో అసలు విషయం చెప్పాడు. శిఖర్ ధావన్ భుజానికి గాయమైందని, తనకి రెండు వారాలు రెస్ట్ అవసరమని వైద్యులు తెలిపారని తెలిపాడు. ఈ క్రమంలో బహుశా ఐపీఎల్ లో జరగబోయే రెండు, మూడు మ్యాచ్ లకి తను అందుబాటులో ఉండకపోవచ్చునని అంటున్నారు.


ఇప్పటికే పాయింట్ల పట్టికలో పంజాబ్ 8వ స్థానంలోకి వెళ్లిపోయింది. 6 మ్యాచ్ లు ఆడి కేవలం 2 మ్యాచ్ లు మాత్రమే గెలిచింది. ఈ సమయంలో ధావన్ భుజానికి గాయం కావడం నిజంగా పంజాబ్ కి కోలుకోలేని దెబ్బే అని చెప్పాలి. పంజాబ్ త్వరలోనే ముంబై ఇండియన్స్, ఆర్సీబీలతో కీలక మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.

Also Read: ధోనీని తలపించిన శాంసన్.. రనౌట్ వీడియో వైరల్..


ఎందుకంటే ఆ రెండు జట్లలో సీనియర్లు, జాతీయ జట్టుకి ఆడుతున్న ఆటగాళ్లున్నారు. వారితో తలపడాలంటే ధావన్ ఉండాల్సిందే. ఎందుకంటే వారి బలాలు, బలహీనతలు తనకే తెలుసు. ఆ సీనియర్లతో ఆడేటప్పుడు జట్టును సమయోచితంగా ముందుండి నడిపించే నాయకుడు ధావన్ అయితేనే కరెక్ట్ అని అంటున్నారు. అయితే శ్యామ్ కర్రన్ కూడా తక్కువేమీ కాదు.

లోస్కోరు మ్యాచ్ ని కూడా కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఇంకొక్క 10 పరుగులైనా చేసి ఉంటే, పంజాబ్ గెలిచి ఉండేదని అందరూ అంటున్నారు. అంతకుమించి బౌలింగ్ లో అందరూ రాణించడం కొంచెం ఆశావాహ పరిణామం అని అంటున్నారు. ధావన్ లేకుండా జట్టుని కర్రన్ ఎలా నడిపిస్తోడో ఇక చూడాలని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

Tags

Related News

Michael Clarke Cancer: మైఖేల్ క్లార్క్ కు క్యాన్సర్… ముక్కు కట్ చేసి మరీ ట్రీట్మెంట్

Ravichandran Ashwin: ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్.. ధోని టార్చర్ తట్టుకోలేకే !

Sanju Samson : ఒకే బంతికి 13 పరుగులు కొట్టిన సంజూ.. చరిత్రలోనే తొలిసారి

Swastik Chikara’s father: నా కొడుకు క్రికెట్ ఆడకున్నా పర్వాలేదు… కోహ్లీకి నీళ్లు ఇచ్చి బతికేస్తాడు

Indian Cricketers: ఆ ఒక్క నిర్ణయం… టీమిండియా క్రికెటర్లకు రూ.250 కోట్ల నష్టం!

Shubman Gill: సారాతో డేటింగ్… టాలీవుడ్ హీరోయిన్ తో పెళ్లి…చిల్ అవుతున్న గిల్ ?

Big Stories

×