Punjab Kings to target Rohit Sharma in IPL 2025 auction: ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ ఫైనల్ అయిపోయాయి. దీంతో ఐపీఎల్ మెగా వేలం నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో జరిగే ఛాన్స్ ఉంది. అంతకన్నా ముందుగానే ప్లేయర్ల రిటెన్షన్ పై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎంతమంది ప్లేయర్లను తీసుకోవాలని విషయంపై క్లారిటీ లేదు. దీనిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఎలాంటి నిబంధనలను రిలీజ్ చేయలేదు. అయితే ఒక్కో ఫ్రాంచైజీ ఐదుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉందనే ప్రచారాలు జరుగుతున్నాయి. అందులో ముగ్గురు భారత ఆటగాళ్లు, ఇద్దరు ఓవర్సీస్ ఆటగాళ్లు ఉండాలని వార్తలు వస్తున్నాయి. ముగ్గురు భారత ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవాలనుకుంటే ముంబై ఇండియన్స్ ఎవరిని వదిలేస్తుందనే చర్చ జరుగుతోంది.
కొన్ని సంవత్సరాల నుంచి ముంబై ఇండియన్స్ కు రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, బుమ్రా కీలక ఆటగాళ్లుగా రాణిస్తున్నారు. గతంలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన హార్దిక్ పాండ్యా మధ్యలో రెండు సీజన్లు గుజరాత్ టైటాన్స్ కు వెళ్లి ఆడాడు. ఆ తర్వాత గత సీజన్ కు ముందే మళ్లీ ముంబై ఇండియన్స్ తో జతకట్టాడు. పాండ్యా ఎంట్రీ ఇవ్వగానే ముంబై యాజమాన్యం జట్టుపగ్గాలను హార్దిక్ పాండ్యాకు అప్పగించింది. రోహిత్ శర్మను ప్లేయర్ గానే పరిమితం చేసింది. కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పించింది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ఉన్నాడు. కానీ ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకునే ముగ్గురు ఆటగాళ్లు ఎవరు అనేది ఉత్కంఠ రేపుతోంది. బూమ్రాను వదిలేసే అవకాశాలు అసలే ఉండవు.
ఎందుకంటే వరల్డ్ క్లాస్ ప్లేయర్ గా భూమి రా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. టి20 వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచాడు. అద్భుతమైన బంతులతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. కేవలం నాలుగు ఓవర్లలోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే సత్తా అతనికి ఉంది. అందుకే బుమ్రాను వదులుకునేందుకు ముంబై ఆసక్తిగా లేదని తెలుస్తోంది. సూర్య కుమార్ యాదవ్ కూడా డేంజరస్ ప్లేయర్ అనే చెప్పాలి. పైగా టి20 భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. భారత జట్టు కెప్టెన్ ను వదులుకునేందుకు ముంబై ఆసక్తిని కనబరచకపోవచ్చు. టాప్ బ్రాండ్ బ్యాటర్ ను వదులుకుంటే ముంబైకే నష్టమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అయితే ఒకే ఒక్క స్పాట్ కోసం రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. ఇద్దరిలో ఒక్కరినే ఎంచుకోవాల్సి వస్తే ముంబై ఇండియన్స్ కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది.
Also Read: IND VS BAN: బంగ్లాతో టీ20 సిరీస్‍కు టీమిండియా జట్టు ఎంపిక..తెలుగోడికి ఛాన్స్ !
టీమిండియా తరఫున టీ20 వరల్డ్ కప్ అందుకున్న హిట్ మ్యాన్ ను ముంబై కొనసాగిస్తుందా? లేదంటే టీమ్ ఇండియా లీడర్ షిప్ గ్రూప్ లో స్థానం కోల్పోయిన హార్దిక్ పాండ్యానే కొనసాగిస్తుందా అనేది చర్చనీయాంశం అవుతుంది. లోకల్ బాయ్ రోహిత్ శర్మ మనసులో ఏముందనేది కూడా కీలకమైన అంశం. ఒకవేళ ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీతో పాటు భారీ ఆఫర్లు కనుక ఉంటే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ను వదిలి వేసే అవకాశాలు ఉన్నాయి. కొందరు అభిమానులు కూడా ముంబై ఇండియన్స్ ను వదిలి వేయడమే మంచిదని చర్చించుకుంటున్నారు. వేలానికి వెళ్తే రోహిత్ శర్మకు రికార్డు ధర పలికే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ముంబై ఇండియన్స్ ఎలాంటి కఠినమైన నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారుతుంది.