Minu Muneer : మలయాళ ఇండస్ట్రీని హేమ కమిటీ నివేదిక ఎలా షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో బయటపడ్డ ప్రముఖుల చీకటి కోణం అభిమానులను సైతం నోరు వెళ్ళబెట్టేలా చేసింది. అందుకే మిగతా ఇండస్ట్రీలలో కూడా ఇలాంటి కమిటీ రావాలని చర్చలు సాగుతున్నాయి. హేమ కమిటీ బయట పెట్టిన నివేదికలో ఎంతోమంది ప్రముఖుల గురించి, వాళ్లు చేసిన లైంగిక వేదింపుపై సంచలనం విషయాలు బట్టబయలు అయ్యాయి. పలువురు నటిమణులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడంతో పెద్ద మనుషుల ముసుగులో ఉన్న పలువురు సెలబ్రిటీలు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో నటి ప్రముఖ డైరెక్టర్ పై బిగ్ బాంబ్ వేసింది. మరి ఆ నటి ఎవరు? ఆ డైరెక్టర్ పై వచ్చిన ఆరోపణలు ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
ఆ సినిమాలు చూడమన్నాడంటూ ఆరోపణలు
ఇప్పటికే చాలామంది నటీమణులు ఇండస్ట్రీలో తమను ఇబ్బందులకు గురి చేసిన వారిపై ఆరోపణలు చేస్తూ కంప్లైంట్ చేశారు. అందులో కొంతమంది అరెస్ట్ కావడం కూడా జరిగింది. ముఖ్యంగా ఫిలిం సెట్లు, ఆడిషన్ చాంబర్లు, రికార్డింగ్ స్టూడియో లలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపించాయి. ఈ లైంగిక వేధింపుల కేసులోనే ప్రముఖ మలయాళ నటుడు ఎడవల బాబు అరెస్టయి, మళ్లీ బెయిల్ పై బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. మరో పాపులర్ నటుడు జయ సూర్య సహా ఏడుగురిపై పోలీసులకు ఫిర్యాదు అందింది.
ఇప్పుడేమో ప్రముఖ మలయాళ డైరెక్టర్ బాలచంద్ర మీనన్ పై మీనూ మునీర్ అనే మలయాళ నటి సంచలన ఆరోపణలు చేసింది. ఈ డైరెక్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ సోషల్ మీడియా వేదికగా తనకు ఎదురైన కష్టాల గురించి ఓపెన్ గా చెప్పి షాక్ ఇచ్చింది. 2007లో బాలచంద్ర తన గదిలో అ*శ్లీల సినిమాలు చూడాలంటూ తనను బలవంతం చేశాడని చెప్పుకొచ్చింది.
పైగా ఆ టైంలో అదే గదిలో మరి కొంతమంది అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు కూడా ఉన్నారని, వాళ్ళని చూసి తను బయటకు వచ్చేసానని చెప్పి బాంబ్ పేల్చింది.. అయినప్పటికీ డైరెక్టర్ బాలచంద్రన్ తనను కూర్చొని అడిగాడని చెప్పడం దుమారం రేపుతోంది..
ఇంతకుముందు కూడా ఇలాంటి ఆరోపణలే
ఇక మునీర్ ఇప్పుడే కాదు గతంలో కూడా సోషల్ మీడియా వేదికగా ఇలాంటి లైంగిక ఆరోపణలకు సంబంధించి షాకింగ్ కామెంట్స్ చేసింది. 2013లో తాను ఒక సినిమాలో నటిస్తున్నప్పుడు ఎదురైన చేదు అనుభవాలను గతంలోనే బయట పెట్టింది. ఆ టైంలో తనను శారీరక, మానసిక వేధింపులకు గురి చేశారని ఆవేదనను వ్యక్తం చేసింది.
అయితే ఆ వేధింపులను భరించలేక తను మెంటల్ గా కృంగిపోయాననీ, వాటిని తట్టుకోలేకనే ఇండస్ట్రీని వదిలేసానని చెప్పింది. ఆ తర్వాత చెన్నై వెళ్లిపోయానని క్లారిటీ ఇచ్చిన ఈ అమ్మడు తాజాగా మళ్లీ సదరు డైరెక్టర్ పై సంచల ఆరోపణలు చేసి వార్తల్లో నిలవడం గమనార్హం.