PV Sindhu : పూసర్ల వెంకట సింధు గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఆమె ఒక భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. 2016 రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. ఈమె డిసెంబర్ 22, 2024న వెంకట దత్త సాయిని పెళ్లి చేసుకుంది. అతను భారత్ పెట్రోలియంలో అసిస్టెంట్ స్పోర్ట్స్ మేనేజర్. పీ.వీ. సింధు రియో ఒలింపిక్స్ లో రజత పతకం తో పాటు 2020 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం, 2019 BWF వరల్డ్ ఛాంపియన్ షిప్ లో రజత పతకం. పద్మశ్రీ, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, పద్మ భూషణ్ అవార్డులు అందుకుంది సింధు. అయితే భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు కి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.
Also Read : Watch Video : ఈ బుడ్డోడు ఏంట్రా.. బుమ్రానే మించిపోయాడు.. ఆ యార్కర్ కు వికెట్ ఎగిరిపోయిందిగా
ప్రస్తుతం ఆమె వియత్నాంలోని అమనోయిలో తన భర్త తో కలిసి వెకేషన్ లో తెగ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఈ బ్యాడ్మింటన్ స్టార్ బికినీలో మెరిసింది. ఆ సమయంలో తీసినటువంటి ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ వేదిక గా పంచుకుంది. ఒక మంచి బ్రేక్ కావాలి.. అంటూ ఈ పోస్ట్ లో రాసుకొచ్చింది. దీంతో సింధు కి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. అభిమానులు, మీడియా వర్గాల్లో ఈ చిత్రాలు తీవ్ర చర్చకు దారి తీయడం విశేషం. ముఖ్యంగా ఆటపరంగా సింధు వరుస వైఫల్యాలు ఎదుర్కుంటున్న నేపథ్యంలో ఈ ఫోటో లు సోషల్ మీడియా ద్వారా బయటికి రావడం గమనార్హం. ఇటీవల కాలంలో ఆమె ఆశించిన స్థాయిలో రాణించలేకపోతుందనే చెప్పవచ్చు. ముఖ్యంగా మలేషియా మాస్టర్స్ టోర్నమెంట్ లో ఆమె తొలి రౌండ్ లోనే ఓటమి పాలై నిష్క్రమించింది. ఇక ఆ తరువాత జరిగినటువంటి ఇండోనేషన్ ఓపెన్ లో కూడా సునాయసంగా విజయం సాధిస్తుందనుకున్న మ్యాచ్ లో ఓడిపోయి.. రెండో రౌండ్ లోనే ఇంటి దారి పట్టింది.
దీంతో పీ.వీ. సింధు కి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈమె ఆటలో మాత్రం ప్రతిభ కనబరచడం లేదు.. కానీ బికినీలతో ఉన్న ఫొటోలు.. భర్తతో రొమాన్స్ కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టడం అవసరమా..? అంటూ కామెంట్స్ చేయడం విశేషం. మరోవైపు ఈ ఏడాది జనవరి నెలలో స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ ప్యూమా కి సింధు కొత్త అంబాసిడర్ గా నియమితులైన విషయం తెలిసిందే. 2025 బ్యాడ్మింటన్ ఇండియా ఓపెన్ లో బ్రాండ్ తో కోర్టులోకి అడుగుపెట్టడమే కాకుండా.. ఫ్యాషన్ రంగంలో కూడా తనదైన ముద్ర వేసింది. ఈ భాగస్వామ్యం ద్వారా బ్యాడ్మింటన్ కోర్టు ఆవల కూడా సింధు తన బ్రాండ్ ఇమేజ్ ని విస్తరించుకుంది. ప్రస్తుతం పీ.వీ. సింధు కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం.