HHVM: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా జూన్ 12వ తేదీ విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలవల్ల వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల చిత్ర బృందం ఈ సినిమా విడుదల వాయిదా ప్రకటిస్తూ కొత్త విడుదల తేదీన త్వరలోనే ప్రకటిస్తామని తెలియజేశారు. తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు. హరిహర వీరమల్లు సినిమా జూన్ 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు నిర్మాతలు అధికారికంగా తెలియజేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా వాయిదా పడిందని నిరాశలో ఉన్న అభిమానులకు కొత్త విడుదల తేదీని ప్రకటిస్తూ పవన్ అభిమానులలో సరికొత్త జోష్ నింపారు.
ఎడిటింగ్ పనులు…
పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా నిజానికి జూన్ 12వ తేదీనే పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండేది. చిత్ర బృందం కూడా ఈ సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు కానీ ఈ సినిమా ఎడిటింగ్ పనులతో పాటు సీజీఐ వర్క్ పూర్తికాని నేపథ్యంలో కొద్దిరోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇలా ఈ సినిమా వాయిదా పడటంతో అభిమానులు చాలా నిరాశ వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ సోలో హీరోగా వెండి తెరపై సందడి చేసి చాలా కాలం అవుతుంది.
థియేటర్లలో జాతర…
ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ మరోసారి వెండితెరపై కనిపించబోతున్నారని అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు . ఈ సినిమా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా పనులు పూర్తి కానీ నేపథ్యంలోనే వాయిదా పడింది. తాజాగా జూన్ 26వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడటమే కాకుండా అన్ని ప్రాంతాలలో కూడా భారీగా బిజినెస్లను జరుపుకుంటుంది.
ఇక జూన్ 26వ తేదీ విడుదల కాబోయే ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా భారీ స్థాయిలో విడుదల కాబోతుందని తెలుస్తుంది. అలాగే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లో ఈ సినిమాని ఆస్ట్రేలియా సైబర్ సిస్టం ద్వారా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమా పై ఇప్పటికే తారస్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను మొఘల్ సామ్రాజ్యకాలం నాటి కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని తెలుస్తుంది. ఇందులో పవన్ కళ్యాణ్ లుక్ కూడా చాలా విభిన్నంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై మంచి అంచనాలను పెంచేసాయి. మరి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ లభిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.