R Ashwin: ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరుగుతున్న సమయంలో అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి వార్తలలో నిలిచాడు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. అయితే తాజాగా మరోసారి హిందీ భాష పై కీలక వ్యాఖ్యలు చేసి {R Ashwin} వార్తల్లోకెక్కాడు. హిందీ భాష గురించి అశ్విన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. చెన్నైలోని ఓ ప్రైవేట్ కాలేజీ గ్రాడ్యుయేషన్ వేడుకకు రవిచంద్రన్ అశ్విన్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు.
Also Read: Varun Aaron Retirement: క్రికెట్‌కు భారత క్రికెటర్ వరుణ్ ఆరోన్ గుడ్‌బై !
ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులతో {R Ashwin} కాసేపు సరదాగా ముచ్చటించాడు. అయితే ఈ వేడుకలో మాట్లాడే ముందు ఇక్కడ హిందీ, తమిళ్, ఇంగ్లీష్ ఎంతమందికి అర్థమవుతుందని విద్యార్థులను ప్రశ్నించాడు అశ్విన్. దీంతో తమిళ్ తో పాటు ఇంగ్లీష్ అర్థం అవుతుందని చాలామంది స్టూడెంట్స్ చేతులు పైకెత్తారు. హిందీ భాష గురించి అశ్విన్ అడిగినప్పుడు ఒకరిద్దరూ విద్యార్థులు మాత్రమే చేతులు పైకి లేపారు. ఇలా విద్యార్థుల రెస్పాన్స్ చూసిన అశ్విన్.. హిందీ అసలు మన జాతీయ భాష కాదన్నారు.
కేవలం అఫీషియల్ లాంగ్వేజ్ మాత్రమేనని అన్నారు అశ్విన్. దీంతో అశ్విన్ {R Ashwin} చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొంతమంది అప్పుడే అశ్విన్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే తమిళనాడు క్రికెట్ అభిమానులు మాత్రం అశ్విన్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఇంజనీరింగ్ బ్యాక్ గ్రౌండ్ నుండి క్రికెటర్ గా మారడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అశ్విన్. తాను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు క్రికెటర్ గా రాణించలేనని చాలామంది అన్నారని.. కానీ పట్టుదలతో క్రికెటర్ గా మారి వారికి సమాధానం చెప్పానని అన్నారు.
జీవితంలో నేర్చుకోవడం ఆపేసిన రోజు మన ఎదుగుదల ఆగిపోతుందని తెలిపారు. అయితే మన దేశంలోని చాలామంది ప్రజలు హిందీని జాతీయ భాషగా భావిస్తారు. వాస్తవానికి హిందీ జాతీయ భాష కాదు. ఈ అంశంపై వివిధ భాషా ప్రయుక్త రాష్ట్రాలు, హిందీ మాట్లాడే రాష్ట్రాల {R Ashwin} మధ్య అనేక వివాదాలు ఉన్నాయి.
Also Read: Yuzvendra Chahal – Manish pandey: చాహల్ బాటలో మరో ప్లేయర్.. భార్యకు విడాకులు ఇచ్చేందుకు నిర్ణయం ?
భారత రాజ్యాంగంలో ఏ భాషకు జాతీయ హోదా ఇవ్వలేదు. భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్ లో గుర్తింపు పొందిన 22 భాషల్లో హిందీ భాష కూడా ఒకటి. స్వతంత్రం అనంతరం భారత రాజ్యాంగాన్ని రూపొందించే ప్రక్రియ జరుగుతున్నప్పుడు రాజ్యాంగ పరిషత్ లో భాష పై చర్చ జరిగింది. ఆ సమయంలో హిందీని జాతీయ భాషగా చేయాలని కొంతమంది కోరగా.. మరికొందరు దీనిని వ్యతిరేకించారు.
Language row reignited again
‘Hindi is not the national language; it is an official language,’ says former cricketer R. Ashwin.
DMK appreciating this won’t be a surprise… I want to ask him, is he a national cricketer or a Tamil Nadu cricketer? — @umaanandansays
How can… pic.twitter.com/h9FtZi1GI7
— TIMES NOW (@TimesNow) January 10, 2025