Yuzvendra Chahal – Manish pandey: ప్రేమ గుడ్డిది అనే నానుడి అందరికీ తెలిసిందే. అయితే ఈ నానుడి క్రికెట్ ప్రపంచానికి సరిగ్గా సూటవుతుందని చెప్పాలి. ఈ విషయం అనేకసార్లు నిరూపితం అయ్యింది కూడా. ప్రేమించి వివాహం చేసుకొనే క్రికెటర్లు ఒకరి తర్వాత ఒకరు విడాకుల బాట పట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. గత కొద్ది రోజులుగా భారత స్టార్ స్పిన్నర్ యూజువేంద్ర చాహల్ తన భాగస్వామి ధనశ్రీ నుంచి విడాకులు తీసుకోబోతున్నాడు అంటూ పెద్ద ఎత్తున రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే.
Also Read: Novak Djokovic: నాపై విష ప్రయోగం జరిగింది.. టెన్నిస్ స్టార్ జోకోవిచ్ సంచలన ఆరోపణ
ఇదిలా ఉండగా తాజాగా మరో జంట కూడా ఈ జాబితాలో చేరింది. భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మనీష్ పాండే – అతని భార్య అశ్రిత శెట్టి విడాకులు తీసుకోబోతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. వీరిద్దరూ సోషల్ మీడియా వేదిక ఇంస్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. వీరిద్దరూ గత కొద్ది రోజులుగా విడివిడిగా ఉంటున్నారు. మొదట ఆశ్రిత తన సోషల్ మీడియాలో మనీష్ పాండే ఫోటోలను తీసివేయగా.. తాజాగా మనీష్ పాండే కూడా అదే పని చేస్తూ అన్ ఫాలో చేశాడు.
దీంతో వీరిద్దరి రిలేషన్ షిప్ లో చీలిక వచ్చిందని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. కానీ వీరు విడాకుల విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ జంటకి 2019వ సంవత్సరం డిసెంబర్ రెండవ తేదీన వివాహం జరిగింది. మనీష్ పాండే సినీనటి హర్షిత శెట్టిని ముంబైలోని ఓ హోటల్ లో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
ముంబైకి చెందిన ఆశ్రిత 2012లో తుళు భాషలో “తులికేడ బొల్లి” అనే సినిమాతో ఇండస్ట్రీలో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత “ఉదయం ఎన్ హెచ్ 4” సినిమా ద్వారా తమిళ పరిశ్రమలో అడుగుపెట్టింది. అయితే ప్రస్తుతం వీరి విడాకుల విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ స్టార్ జెంట స్పందిస్తుందా..? లేదా..? అన్నది వేచి చూడాలి. ఇక ఉత్తరాఖండ్ కి చెందిన మనీష్ పాండే 2015లో భారత జట్టు తరుపున అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టాడు.
Also Read: South Africa Sports Minister: అఫ్గాన్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలి.. సౌతాఫ్రికా సంచలన నిర్ణయం !
ఈ కుడి చేతివాటం బ్యాటర్ టీమిండియా తరఫున తన కెరీర్ లో 29 వన్డేలు, 39 t20 మ్యాచ్ లు ఆడాడు. వన్డేల్లో 566 పరుగులు, టి20 ల్లో 709 పరుగులు చేశాడు. ఇతనికి జాతీయ జట్టులో ఎక్కువగా అవకాశాలు రాకపోయినా.. ఐపీఎల్ లో మాత్రం మంచి రికార్డు ఉంది. 172 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన మనీష్ పాండే.. 3850 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఐదు మ్యాచ్ లు ఆడిన మనీష్ పాండే కేవలం 117 పరుగులు మాత్రమే చేశాడు.
Another divorce rumor surfacing.
– Manish Pandey and Ashrita Shetty are not following eachother on Instagram.
– No pics in either of the account with the other person in the frame.
Cricketers and divorce – A never ending story. pic.twitter.com/FSGC9U20BL
— Inside out (@INSIDDE_OUT) January 10, 2025