Game Changer : శంకర్ – రామ్ చరణ్ (Ram Charan) కాంబినేషన్లో వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీ ప్రస్తుతం థియేటర్లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తాజాగా ఆ పిటిషన్ పై విచారణ జరగగా, ధర్మాసనం ప్రభుత్వం తీరుపై సీరియస్ అయింది.
‘గేమ్ ఛేంజర్’కు షాక్
గొర్ల భరత్ రాజు అనే వ్యక్తి తెలంగాణలో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం రోజు జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి దీనిపై విచారణ చేపట్టగా, జనవరి 10న ఉదయం 4:30 బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా టికెట్ పెంపుపై కూడా ఉత్తర్వులు ఇవ్వకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ధర్మసనాన్ని కోరారు. దీంతో హైకోర్టు తరచుగా ఇలాంటి మెమోలు ఎందుకు ఇస్తున్నారు? అని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. తదుపరి విచారణను ఈరోజుకి వాయిదా వేయగా, నేడు మరోసారి దీనిపై విచారణ చేపట్టింది ధర్మాసనం.
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీ టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలపై హైకోర్టులో తాజాగా విచారణ జరిగింది. అయితే సినిమా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడంపై కోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలను రద్దు చేశామని అంటూనే ప్రత్యేక షోలకు అనుమతులు ఇవ్వడం ఏంటి ? అని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. తెల్లవారుజామున షోలకు అనుమతిపై పునః సమక్షించాలని హైకోర్టు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఈ మేరకు ఆదేశించింది. అయితే భారీ బడ్జెట్ తో సినిమాలను తీసి ప్రేక్షకుల నుంచి వసూలు చేయాలనుకోవడం సరికాదని ఈ మేరకు కోర్టు సీరియస్ అయింది. దీనికి సంబంధించిన విచారణ ఈనెల 24 వాయిదా పడింది.
‘గేమ్ ఛేంజర్’కు పెరిగిన టికెట్ ధరలు
అయితే ఇప్పటికే ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాకు సంబంధించిన బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతిని నిరాకరించిన సంగతి తెలిసిందే. ‘గేమ్ ఛేంజర్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతిని ఇవ్వడంతో హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్త ఉత్తర్వులు జారీ చేశారు. బెనిఫిట్ షోలకి మాత్రమే అనుమతిని నిరాకరించిన ప్రభుత్వం జనవరి 10న ఉదయాన్నే 4 గంటల నుంచి 6 గంటల వరకు అనుమతినిచ్చింది. జనవరి 10న మల్టీప్లెక్స్ థియేటర్లలో ఒక్కో టికెట్ పై అదనంగా రూ. 150, సింగిల్ స్క్రీన్ లలో అదనంగా రూ. 100 పెంచుకునే వెసులుబాటును కల్పించింది. అలాగే జనవరి 11 నుంచి ప్రతిరోజూ 5 షోలకు గ్రీన్ సింగిల్ ఇచ్చినట్టు ఆ జీవోలో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే మూవీ రిలీజ్ అవ్వడంతో దీనివల్ల ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు వచ్చే నష్టమేమీ లేకపోవచ్చు. కానీ ఫ్యూచర్ లో రిలీజ్ కానున్న సినిమాలకు మాత్రం ఇలాగైతే కష్టమే.