E-Paper
Advertisement

Rahul Dravid: సంజు శాంసన్‌తో గొడవలు… ద్రవిడ్ హాట్ కామెంట్స్ !

Rahul Dravid: సంజు శాంసన్‌తో గొడవలు… ద్రవిడ్ హాట్ కామెంట్స్ !
Advertisement

Rahul Dravid : ఐపీఎల్ 2025లో ఆటతో పాటు పలు ఇతర విషయాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఏదో విషయం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ఈ తరుణంలోనే రాజస్థాన్ రాయల్స్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ సంజూ శాంసన్ ల మధ్య విభేదాలు తలెత్తినట్టు సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీతో రాజస్థాన్ మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో వీరికి గొడవ జరిగిందనే వార్తలు సోషల్ మీడియాలో కోడై కూసింది. అయితే ఈ మ్యాచ్ లో సూపర్ ఓవర్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

ద్రవిడ్- సంజూ విభేదాలు ఢిల్లీకి ప్లస్ అయ్యాయని.. వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉందని రూమర్స్ వస్తున్నాయి. ఎట్టకేలకు తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చాడు రాహుల్ ద్రవిడ్. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ తో తనకు ఎలాంటి విబేధాలు లేవని హెడ్ కోచ్ ద్రవిడ్ వెల్లడించారు. ఇద్దరి మధ్య మనస్పార్థాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయని.. ఓ విలేకరీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. వాస్తవానికి ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదని.. మేము తీసుకునే ప్రతీ నిర్ణయంలో కెప్టెన్ సంజూ కూడా భాగమవుతాడు. అతనితో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని.. జట్టు ఓడిపోయినప్పుడు విమర్శలు సహజం అన్నారు.

Advertisement

అన్ని సార్లు ఫలితాలు అనుకూలంగా రావని చెప్పాడు. సాదారణం గా మ్యాచ్ గెలిస్తే.. ఎవ్వరూ ఏ విషయాన్ని పట్టించుకోరని.. కానీ ఓడిపోతే మాత్రం ప్రతి దానిని భూతద్దంలో పెట్టి మరీ చూస్తారని విమర్శకులకు చురకలు అంటించాడు రాహుల్ ద్రవిడ్. ఇలాంటి వార్తలను అస్సలు పట్టించుకోవద్దని.. ఢిల్లీ క్యాపిటల్స్ తో సూపర్ ఓవర్ మ్యాచ్ జరిగిన సమయంలో డగౌట్ కి దూరంగా ఉన్నాడు సంజూ. దీంతో అతడినీ దూరం పెట్టారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.  టీమ్ మేనేజ్ మెంట్ అతన్ని పట్టించుకోవడం లేదని కామెంట్స్ వినిపించాయి. అది వాస్తవం కాదు.. అని క్లారిటీ ఇచ్చాడు ద్రవిడ్.

ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో హోరా హోరీ మ్యాచ్ జరిగింది. అయితే ఇరు జట్లు సమాన స్కోర్ చేయడంతో సూపర్ ఓవర్ ఆడారు. అయితే రాజస్థాన్ తరపున హిట్ మేయర్, రియాన్ పరాగ్ ని పంపించింది. అయితే హిట్మేయర్ ని పంపించడంతోనే రాజస్థాన్ ఓటమి పాలైందని పలువురు పేర్కొంటున్నారు. ముఖ్యంగా మిచెల్ స్టార్క్ అద్భుతమైన బౌలింగ్ తో ఢిల్లీకి విజయాన్ని అందించాడు. సూపర్ ఓవర్ లో 11 పరుగులు మాత్రమే ఇచ్చి.. ఢిల్లీకి విజయాన్ని అందించాడు. వాస్తవానికి హిటెమేయర్ అంతకు ముందే స్టార్క్ బౌలింగ్ లో రన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు. స్టార్క్ వేసే యార్కర్లకు సింగిల్స్ తీయగలిగాడు. అలాంటి బ్యాటర్ ను సూపర్ ఓవర్ ఆడించడం బ్లండర్ మిస్టేక్ అంటూ కామెంట్స్ చేశారు. రన్స్ రావడం లేదని తీవ్ర ఒత్తిడిలో ఉన్న హిట్మేయర్ పరాగ్, జైస్వాల్ లను రన్ ఔట్ చేశాడు.  దీంతో ఢిల్లీ గెలుపు సునాయసం అయింది.

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×