రోజులో 24 గంటలు ఉంటాయి. 12 గంటలు సూర్యకాంతి ఉంటే, మరో 12 గంటలు రాత్రి సమయం ఉంటుంది. కానీ, ప్రపంచ వ్యాప్తంగా సూర్యుడు అస్తమించని దేశాలు ఉన్నాయి. అక్కడ సుమారు 70 రోజులకు పైగా రవి అస్తమించడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అక్కడి ప్రజలకు కూడా డే అండ్ నైట్ లేకపోవడం వల్ల ఎంతో గందరగోళానికి గురవుతారు. ఇంతకీ సూర్యుడు అస్తమించని ఆ దేశాలు ఏవో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ నార్వే
ఆర్కిటిక్ సర్కిల్ లో ఉన్న నార్వేను ‘ల్యాండ్ ఆఫ్ ది మిడ్ నైట్ సన్’ అని పిలుస్తారు. ఇక్కడ మే నుంచి జూలై చివరి వరకు సూర్యుడు అస్తమించడు. సుమారు 76 రోజుల పాటు నిరంతరాయంగా సూర్యుడు అస్తమించడు. నార్వేలోని స్వాల్ బార్డ్ లో ఏప్రిల్ 10 నుంచి ఆగస్టు 23 వరకు సూర్యుడు కనిపిస్తాడు. సెప్టెంబర్ నుంచి మార్చి వరకు కంప్లీట్ చీకటిగా ఉంటుంది. సూర్యుడు కనిపించడదు. నిరంతరం బయట నక్షత్రాలు కనిపిస్తాయి. ఇలాంటి ప్లేస్ ను జీవితంలో ఒక్కసారైన చూడాలనుకుంటే నార్వేకు వెళ్లండి.
⦿ కెనడా
కెనడాలోని వాయవ్య భూభాగంలోని ఆర్కిటిక్ సర్కిల్ కు రెండు డిగ్రీల ఎత్తులో ఉంది నునావుట్. ఈ ప్రదేశంలో రెండు నెలల పాటు సూర్యుడు అస్తమించడు. శీతాకాలంలోఈ ప్రదేశం వరుసగా నెల రోజుల పాటు చీకటిగా ఉంటుంది.
⦿ ఐస్ లాండ్
గ్రేట్ బ్రిటన్ తర్వాత ఐస్ లాండ్ యూరప్ లో అతిపెద్ద ద్వీపం. దోమలు లేని దేశంగా ప్రసిద్ధి చెందింది. వేసవి కాలంలో ఐస్ లాండ్ లో సూర్యుడు అస్తమించడు. సుమారు నెల రోజుల పాటు ఇక్కడ వెలుగే కనిపిస్తుంది. ఆర్కిటిక్ సర్కిల్ లోని అకురేరి నగరంతో పాటు గ్రిమ్సే ద్వీపంలోనూ నెల రోజుల పాటు సూర్యుడు అస్తమించడు.
⦿ అలాస్కా
అలస్కాలోని బారోలో మే చివరి నుంచి జూలై చివరి వర సూర్యుడు అస్తమించడు. నవంబర్ ప్రారంభం నుంచి డిసెంబర్ 1 వరకు చీకటి ఉంటుంది. ఈ ప్రాంతాన్ని ధృవ రాత్రి అని పిలుస్తారు. శీతాకాల నెలల్లో దేశం చీకటిలోనే ఉంటుంది. మంచుతో కప్పబడిన పర్వతాలు, హిమానీనదాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి.
⦿ ఫిన్లాండ్
వేల సరస్సులు, ద్వీపాల భూమి అయిన ఫిన్లాండ్ లోని చాలా ప్రాంతాలు వేసవిలో కేవలం 73 రోజులు మాత్రమే సూర్యుడిని నేరుగా చూడగలవు. ఆ తర్వాత రోజులన్నీ చీకటిగా ఉంటాయి. ఇక్కడి ప్రజలు వేసవిలో తక్కువ నిద్రపోవడానికి, శీతాకాలంలో ఎక్కువ నిద్రపోవడానికి ఇది కూడా ఒక కారణం.
⦿స్వీడన్
మే ప్రారంభం నుంచి ఆగస్టు చివరి వరకు స్వీడన్‌లో సూర్యుడు అర్ధరాత్రి సమయంలో అస్తమించి తెల్లవారుజామున 4 గంటలకు ఉదయిస్తాడు. ఏడాదిలో 6 నెలలు మాత్రమే ఒక్కడ సూర్యరశ్మి కనిపిస్తుంది.ఇక్కడికి వచ్చే పర్యాటకులు అడ్వెంచరస్ ఈవెంట్స్ తో పాటు గోల్ఫ్ ఆడటం, చేపలు పట్టడం, ట్రెక్కింగ్ ట్రైల్స్ లాంటివి చేస్తుంటారు.
Read Also: ఇండియా నుంచి అమెరికా ప్రయాణం, జస్ట్ 18 నిమిషాల్లోనే, మస్క్ ప్లాన్ చూస్తే మతిపోవాల్సిందే!