E-Paper
Advertisement

Rahul Dravid Set to RR coach: ఐపీఎల్ 2025, ఐపీఎల్‌లో ద్రావిడ్ రీఎంట్రీ, రాజస్థాన్ కోచ్‌గా..

Rahul Dravid Set to RR coach: ఐపీఎల్ 2025, ఐపీఎల్‌లో ద్రావిడ్ రీఎంట్రీ, రాజస్థాన్ కోచ్‌గా..
Advertisement

Rahul Dravid Set to RR coach(Latest sports news telugu): టీమిండియా మాజీ కోచ్ రాహుల్‌ద్రావిడ్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టనున్నాడా? ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడా? రాజస్థాన్ రాయల్ టీమ్‌కి కోచ్‌గా రానున్నాడా? అవుననే సమాధానం వస్తోంది.

టీమిండియా మాజీ కోచ్ రాహుల్‌ద్రావిడ్ తన కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నాడు. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ఐపీఎల్‌లో రాహుల్‌ద్రావిడ్ కోచ్ అవతారం ఎత్తే అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్ టీమ్ యాజమాన్యం ద్రావిడ్‌తో మంతనాలు జరిపినట్టు సమాచారం. తమ జట్టుకు హెడ్ కోచ్‌గా రావాలని కోరినట్టు తెలుస్తోంది. జట్టు యాజమాన్యం కోరిక మేరకు ద్రావిడ్ సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

ద్రావిడ్‌కు రాజస్థాన్ జట్టుతో మంచి అనుబంధం ఉంది. గతంలో ఆ జట్టుకు 2012,2013 సీజన్లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. 2014-15 సీజన్లలో ఆ జట్టుకు మెంటార్‌గా పని చేశాడు కూడా. ఆ తర్వాత 2016-17 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కోచ్‌గా వ్యవహరించాడు. అనంతరం 2019 నుంచి భారత అండర్-19 జట్టుకు కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు.

ALSO READ: శ్రీలంకలో టీమిండియా, నేటి నుంచి ప్రాక్టీసు.. ఆ తర్వాత రోహిత్, కోహ్లి..

Advertisement

ఇప్పుడు మరోసారి రాజస్థాన్‌కు జట్టుకు ద్రావిడ్ సేవలు అందించబోతున్నట్లు ఈ మేరకు జాతీయ మీడియా లో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కుమార సంగక్కర కోచ్‌, మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల టీమిండియా కోచ్ పదవి నుంచి తప్పకున్న రాహుల్‌ద్రావిడ్, ప్రస్తుతం తాను నిరుద్యోగనని, ఏదైనా ఉద్యోగం కావాలని సరదాగా వ్యాఖ్యానించాడు. రాహుల్ నోటి నుంచి వచ్చిన మాటను తనకు అనుకూలంగా మలచుకుంది రాజస్థాన్ రాయల్ టీమ్ యాజమాన్యం.

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×