BigTV English

IPL 2025 : గుజరాత్, రాజస్థాన్ లో పై చేయి ఎవరిదో..?

IPL 2025 : గుజరాత్, రాజస్థాన్ లో పై చేయి ఎవరిదో..?

IPL 2025 : ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో కొనసాగుతోంది. రెండో స్థానంలో గుజరాత్ టైటాన్స్ కొనసాగుతోంది. అయితే ఇవాళ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య పోరు జరుగనుంది. ప్రస్తుతం పాయింట్ల టేబుల్స్ లో రెండో స్థానంలో ఉన్న గుజరాత్ జట్టు.. ఇవాళ మ్యాచ్ గెలిచి అగ్ర స్థానానికి చేరుకోవాలని భావిస్తోంది. అలాగే గత రెండు మ్యాచ్ లలో విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ అలాగే విజయాలను కొనసాగించి హ్యాట్రిక్ విన్ నమోదు చేయాలని చూస్తోంది.


గత ఏడాది ఈ రెండు జట్లు తలపడిన సమయంలో రాజస్థాన్ 197 పరుగులు లక్ష్యాన్ని ఇవ్వగా.. గిల్ సేన చివరి బంతికి ఛేదించి గుజరాత్ ను గెలుపు తీరాలకు చేర్చారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో 23వ మ్యాచ్ లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఇవాళ రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. గుజరాత్ టైటాన్స్ కి శుబ్ మన్ గిల్ నాయకత్వం వహిస్తుండగా.. రాజస్థాన్ రాయల్స్ జట్టుకి సంజు శాంసన్ నాయకత్వం వహిస్తాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెండు జట్ల మధ్య పోటీ ఉత్కంఠగా మారే అవకాశం ఉంది.

ఐపీఎల్ 2025లో గుజరాత్ జాయింట్స్-రాజస్థాన్ రాయల్స్ జట్లు కేవలం పాయింట్ల కోసం మాత్రమే కాకుండా.. ఆధిపత్యం కోసం కూడా పోరాడుతుంటాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన 6 హోరా హోరీ మ్యాచ్ లలో గుజరాత్ జట్టు రాజస్థాన్ ను 5 సార్లు ఓడించింది. 2023లో అహ్మదాబాద్ లో రాజస్థాన్ విజయం సాధించింది. ఈసారి కూడా అలాంటి విజయం నమోదవుతుందా..? అని అభిమానులు భావిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ తరపున శ్రీలంక స్పిన్ ద్వయం మహీష్ తీక్షణ, వనిందు హసరంగా తమ పాత్రలను అద్భుతంగా పోషిస్తున్నారు. ముఖ్యంగా తీక్షణకు మూడు దశల్లో బౌలింగ్ బాధ్యత అప్పగించారు.


మరోవైపు హసరంగా మిడిల్ ఓవర్లలో వికెట్ తీసే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ 2025లో స్పిన్నర్లు అత్యధిక వికెట్లను తీసిన జట్లలో రాజస్థాన్ జట్టు రెండో స్థానంలో ఉండటం విశేషం. ఇద్దరూ బౌలర్లు కలిసి మొత్తం 11 వికెట్లు పడగొట్టారు. ఇక గుజరాత్ బలం టాప్ 3 బ్యాట్స్ మెన్స్. ఈ సీజన్ లో ఇప్పటివరకు లీగ్ లో గుజరాత్ టాప్ ఆర్డర్ అత్యుత్తమమైనదని మారింది. ప్రతీ మ్యాచ్ లో కూడా టాప్ 3 బ్యాట్స్ మెన్ లలో ఒకరు హాఫ్ సెంచరీ సాధిస్తూనే ఉన్నారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. మహ్మద్ సిరాజ్ అద్భుతమైన పునరాగమనం చేసి తొలి ఓవర్లలోనే ప్రత్యర్థి జట్ల వెన్ను విరిచాడు.

మొదటి మ్యాచ్ సిరాజ్ కి ప్రత్యేకమైనది కాదు.. ఎందుకంటే అతను 13.5 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. తరువాత మూడు మ్యాచ్ లలో అద్భుతమైన ఫామ్ తో ఆకట్టుకున్నాడు. 5.8 ఎకానమీతో మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్ లో పవర్ ప్లే లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కూడా సిరాజ్ కావడం విశేషం. ఇప్పటి వరకు 6 ఓవర్లలో ఆరుగురు బ్యాట్స్ మెన్ లను ఔట్ చేసాడు. గుజరాత్ బౌలర్లు పవర్ ప్లేలో ఆకట్టుకుంటున్నారు. ఈ స్టేడియంలో భారీ స్కోర్లు నమోదు అవుతుండటం విశేషం.

Related News

Haris Rauf: హ‌రీస్ ర‌ఫ్ ను ర్యాగింగ్ చేసిన ఫ్యాన్స్‌..కోహ్లీ, కోహ్లీ అంటూ

Ind Vs Pak: చ‌ల్ పోరా పో….షాహిన్ అఫ్రీదిని బండ బూతులు తిట్టిన అభిషేక్‌…సిక్స్ కొట్టి మ‌రీ

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

IND Vs PAK : Ak 47 గ‌న్స్ పేల్చుతూ పాకిస్థాన్ సెల‌బ్రేష‌న్స్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Rohith Sharma : టీమిండియా కోచ్ గా రోహిత్ శర్మ… త్వరలోనే రిటైర్మెంట్?

IND Vs PAK : సీన్ రిపీట్… పాకిస్తాన్ పరువు తీసిన సూర్య కుమార్ యాదవ్

Asia Cup 2025 : బంగ్లా, శ్రీలంక మ్యాచ్ లో నాగిని డ్యాన్స్‌.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

IND Vs PAK : ఆసియా కప్ లో కలకలం… టీమిండియా ప్లేయర్లు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!

Big Stories

×