Brahmamudi serial today Episode: దుగ్గిరాల కుటుంబం మొత్తం రాజ్‌ను చూసి షాక్ అవుతారు. దగ్గరకు వెళ్లి ఎమోషనల్ అవుతారు. రాజ్ మాత్రం ఎవరండి మీరు అని అడుగుతాడు. దీంతో అందరూ మళ్లీ షాక్ అవుతారు. ఇంతలో యామిని ఎవరండి మీరు తను రాజ్ కాదు రామ్. నా బావ. తన చిన్నతనంలోనే వాళ్ల అమ్మా నాన్నా చనిపోతే మా దగ్గరే పెరిగాడు. చిన్నప్పటి నుంచి కలిపి పెరిగాం. కలిపి బతికాం. ఇప్పడు కలిసి జీవితాన్ని కూడా పంచుకోబోతున్నాం. మధ్యలో మీరంతా వచ్చి రాజ్ అంటూ ఏంటి గొడవ. ఏంటి మమ్మీ మీరు మౌనంగా చూస్తున్నారు. డాడీ వాళ్ల చెల్లెలు కొడుకే కదా బావ అంటుంది. ఇంతలో అపర్ణ ఓరేయ్ రాజ్ ఎవర్రా అమ్మాయి.. అని అడుగుతుంది. దీంతో రాజ్ తను నాకు కాబోయే భార్య యామిని అంటాడు.
దీంతో అపర్ణ కోపంగా నీకు మళ్లీ పెళ్లేంటి..? నీకు ఆలెరెడీ పెళ్లి అయింది కదా..? నీ పెళ్లాంతో సంవత్సరంన్నర కాపురం కూడా చేశావు. ఇది కూడా నీకు గుర్తు లేదా అంటుంది. వెనక నిలబడిన కావ్య దగ్గరకు వెళ్లి రా కావ్య అంటూ పిలుస్తుంది. కావ్యను చూసిన రాజ్ షాక్ అవుతాడు. కళావతి అంటూ మనసులో అనుకుంటాడు. కావ్య అక్కడ అంతా జరుగుతుంటే ఇక్కడ నిలబడి చూస్తావేంటి..? నీ మొగుడు బతికే ఉన్నాడని మాకు చెప్పింది నువ్వే కదా ఇప్పునడు కళ్ల ముందుకు వస్తే కనిపించకుండా ఇలా దూరంగా నిలబడ్డావేంటి.. అంటూ కావ్యను రాజ్ ఎదురుగా తీసుకెళ్లి ఇదే నీ భార్యరా అంటూ అపర్ణ చెప్పగానే.. రాజ్ కూల్‌గా తను నాకు తెలుసు తన పేరు కళావతి తను నాకు ఫ్రెండ్ అంటాడు. దీంతో అపర్ణ రాజ్‌ను తిడుతుంది. దీంతో రాజ్ మా ఇద్దరి మధ్య ఈ మధ్యనే పరిచయం అయింది. తన పేరు కళావతి తను నా భార్యే అయితే ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదు. అంటూ నిలదీస్తాడు. దీంతో అందరూ కావ్య ఎందుకు ఇన్ని రోజులు నిజం చెప్పలేదు అంటూ ప్రశ్నిస్తారు. ఇంతలో కావ్య ఆయన చెప్పేది నిజమే.. ఆయనకు మనం ఎవరమో తెలియదు అని చెప్తుంది.
అందరూ షాక్ అవుతారు. ఇంతలో రుద్రాణి ఓహో సూపర్ ట్విస్టు అదిరిపోయింది. అంటే తను మన రాజ్ కాదన్నమాట. తన పేరు యామిని చెప్తున్నట్టు రామ్ అన్నమాట అంటుంది. రాజ్‌లా ఉన్నాడని తనతో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నావా..? ఇప్పుడు డబుల్ యాక్షన్ ఉన్నాడని చెప్తున్నావా..? అని అడుగుతుంది. దీంతో కావ్య ఆయన రామ్ కాదు రాజ్ అని చెప్తుంది. దీంతో రద్రాణి నీ కంటికి మేము జోకర్స్ లా కనిపిస్తున్నామా..? ఎవరో తెలియకపోతే రాజ్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని అడుగుతుంది. దీంతో కావ్య ఎందుకంటే ఆయన గతం మర్చిపోయారు. ఆ రోజు మేము శ్రీశైలంకు వెళ్లినప్పుడు జరిగిన యాక్సిడెంట్‌లో ఆయన గతం మర్చిపోయారు. ఏదో ఒక రోజు ఆయన్ని మామూలు మనిషిని చేసి మీ అందరికీ చూపించాలనుకున్నా.. అందుకే ఈ విషయాలు మీ దగ్గర దాచాలనుకన్నా అని చెప్తుంది. దీంతో సుభాష్ ఏంటమ్మా కావ్య ఇదంతా వాడికి గతం గుర్తు లేకపోతే మన ఇంటికి తీసుకొచ్చి వాడికి గతం గుర్తుకు వచ్చేలా ప్రయత్నం చేయాలి కానీ వాళ్లెవరో తెలియని ఇంట్లో పెట్టి మాకు అందరికీ ఎందుకు దూంర చేశావు అని అడగ్గానే కావ్య ఎలా తీసుకురమ్మంటారు మామయ్య.. ఆ యామిని ఆడే నాటకంలో ఆయన ఒక పావులా మారిపోయారు. ఇప్పుడు ఆయనకి ఇలాంటి విషయాలు చెప్పి ఆయనకు ప్రెషర్ ఇస్తే డాక్టర్ గారు ఆయన ప్రాణాలకే ప్రమాదం అన్నారు. అంటూ చెప్తుండగానే..
యామిని మీ అందరికీ మళ్లీ చెప్తున్నాను తను రాజ్ కాదు రామ్ నా బావ. సిక్స్ మంత్స్ బ్యాక్ ఆయనక యాక్సిండెంట్ అయి కోమాలోకి వెళ్లాడు. బావ నువ్వు వీళ్ల మాటలు నమ్మకు వాళ్లు కట్టు కథలు చెప్తున్నారు అంటుంది. దీంతో అపర్ణ కోపంగా ఎవరు కట్టుకథలు చెప్తున్నారో ఇప్పుడే నిరూపిస్తాను అంటుంది. దీంతో కావ్య ఫ్లీజ్ అత్తయ్యా ఇప్పటికే మనం చాలా మాట్లాడాము ఆయన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పగానే అపర్ణ ఎమోషనల్ అవుతుంది. ఏడుస్తూ.. ఇంతలో యామిని రాజ్‌ను తీసుకుని వెళ్తుంటే.. సుభాష్, స్వప్న అందరూ కలిసి రాజ్‌ను గతం గుర్తు చేసుకోమని చెప్తుంటారు. ఇంతలో యామిని వెళ్లబోతుంటే.. అపర్ణ కోప్పడుతుంది. ఇవాళ నిజం తెలిసే దాకా ఇక్కడి నుంచి ఎవ్వరూ కదిలేది లేదు అంటూ నిలదీస్తుంది. అందరూ కలిసి గొడవ పడుతుంటారు. ఇంతలో రాజ్ స్పృహ తప్పి పడిపోతాడు. వెంటనే అపర్ణ అక్షింతలు తీసుకో కావ్య అంటూ గట్టిగా పిలుస్తుంది. వెంటనే కావ్య స్పృహలోకి వచ్చి ఇదంతా కలా అనుకుంటుంది.
వెంటనే రాజ్‌ను ఇక్కడి నుంచి ఎలాగైనా పంపించాలని తను కనబడితే యామినియే ఇక్కడి నుంచి తీసుకెళ్తుందని అక్షింతలు తీసుకుని వెళ్తుంది. కావ్యను చూసిన రాజ్ హ్యాపీగా ఫీలవుతాడు. రాజ్‌ను తీసుకుని అక్కడి నుంచి ఎలాగైనా వెళ్లాలనుకుంటుంది యామిని. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?