Big Stories

Rohit Sharma: ముంబై వర్సెస్ రోహిత్ శర్మ.. 200 మ్యాచ్ లు

Rohit Sharma reaches 200 match landmark for Mumbai Indians
 

Rohit Sharma Mumbai Indians 200 Match IPL 2024: రోహిత్ శర్మ ఐపీఎల్ లో ఒక కొత్త రికార్డ్ సృష్టించాడు. అంటే పరుగుల రికార్డ్ కాదది.. ముంబై ఇండియన్స్ తరఫున 200 మ్యాచ్ లు ఆడిన తొలి ప్లేయర్ గా చరిత్రకెక్కాడు. హైదరాబాద్ లో సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆడటంతో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు.

- Advertisement -

2011‌లో ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ చేరాడు. చేరిన రెండేళ్లకే కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. 2013 నుంచి 2023 వరకు ఆ జట్టుకు సారథ్యం వహించాడు. అంతేకాదు ముంబై ఇండియన్స్‌ కు ఐదు సార్లు ఛాంపియన్‌ ట్రోఫీ అందించాడు.  2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్స్ గెలిచింది.

- Advertisement -

200 ఐపీఎల్ మ్యాచ్‌ లు ఆడిన వారిలో తను మూడో ఆటగాడిగా నిలిచాడు.  రోహిత్ శర్మ కన్నా ముందు ఆర్‌సీబీ, చెన్నై సూపర్ కింగ్ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీలు ఉన్నారు.  ఓవరాల్‌గా చూస్తే రోహిత్ శర్మకు ఇది 245వ ఐపీఎల్ మ్యాచ్ కావడం విశేషం.

Also read:ఉప్పల్‌లో  పరుగుల పండుగ.. రికార్డు ఛేజ్‌లో చతికిలపడ్డ ముంబై.. 

హైదరాబాద్‌ లో మ్యాచ్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ రోహిత్ శర్మను 200 నెంబర్ జెర్సీ‌తో సత్కరించింది. టీమ్ మెంటార్ సచిన్ టెండూల్కర్.. జెర్సీని అందిస్తూ రోహిత్ శర్మను అభినందించాడు.
రికార్డుల కోసం తానెప్పుడూ ఆడనని రోహిత్ శర్మ చెబుతుంటాడు. రికార్డులెప్పుడు చిరకాలం ఉండవని అంటాడు. ఈరోజు గెలిచిన మ్యాచ్, అందులో మనం ఆడిన ఆట మాత్రమే ముఖ్యమని అంటున్నాడు. అందుకు ఉదాహరణగా సచిన్ టెండుల్కర్ రికార్డ్స్ నే చెబుతుంటాడు. తను సాధించిన ఎన్నో రికార్డులు మాయమైపోయాయని అన్నాడు.

ఈ రికార్డుల పిచ్చిని వదిలించడానికి తను శాయశక్తులా ప్రయత్నిస్తున్నానని చెబుతూనే ఉంటాడు. తాజాగా విరాట్ కొహ్లీ కూడా అదే మాట అన్నాడు. రికార్డ్స్ కాదు జ్నాపకాలే ముఖ్యమని అన్నాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News